AUDOA MBA: ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
AUDOA MBA: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, 2024-2025 విద్యాసంవత్సరానికిగాను సెల్ఫ్ సపోర్టెడ్ ప్రోగ్రామ్ కింద ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
Andhra University MBA Admissions: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో 2024-2025 విద్యాసంవత్సరానికిగాను సెల్ఫ్ సపోర్టెడ్ ప్రోగ్రామ్ కింద ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 60 సీట్లను భర్తీచేస్తారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సైనిక కుటుంబాలకు చెందినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లించాలి. అభ్యర్థులు 'Registrar, A.U. Common Entrance Test & Admission Account' పేరిట విశాఖపట్నంలో చెల్లుబాటు అయ్యేలా ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి డిడి తీయాల్సి ఉంటుంది.
సరైన అర్హతలున్నవారు జూన్ 18లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. ఎంపికైనవారికి రెండేళ్లపాటు కోర్సు నిర్వహిస్తారు. డిఫెన్స్ పర్సనల్స్, డిపెండెంట్లు రూ.40,000. ఇతరులు రూ.60,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు..
* ఎంబీఏ ప్రోగ్రామ్
విభాగం: లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్.
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
సీట్ల సంఖ్య: 60.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లించాలి. అభ్యర్థులు 'Registrar, A.U. Common Entrance Test & Admission Account' పేరిట విశాఖపట్నంలో చెల్లుబాటు అయ్యేలా ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి డిడి తీయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ ఫీజు: రూ.500.
ప్రాధాన్యం: ఆర్మ్‌డ్ ఫోర్సెస్ పర్సనల్స్, డిపెండెండ్స్, వార్డ్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అభ్యర్థులకు ప్రాధాన్యం.
కోర్సు ఫీజు: డిఫెన్స్ పర్సనల్స్, డిపెండెంట్లకు రూ.40,000. ఇతరులకు రూ.60,000.
దరఖాస్తు విధానం: యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: యూనివర్సిటీ నిబంధనల ప్రకారం.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Office of Directorate of Admissions,
Andhra University,
Vijayanagar Palace, Pedawaltair,
Visakhapatnam-530017.
ముఖ్య తేదీలు...
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 18.06.2024.
➥ సీట్ల కేటాయింపు: 20.06.2024.
ALSO READ:
ఇఫ్లూలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (English and Foreign Languages University) 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా హైదరాబాద్, షిల్లాంగ్, లఖ్‌నవూలోని ఇఫ్లూ క్యాంపస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలున్నవారు మే 8లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..