EFLU: ఇఫ్లూలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇలా
EFLU: హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
EFLU Admissions 2024: హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (English and Foreign Languages University) 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా హైదరాబాద్, షిల్లాంగ్, లఖ్‌నవూలోని ఇఫ్లూ క్యాంపస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించి యూజీసీ నెట్(UGC-NET)/యూజీసీ సీఎస్‌ఐఆర్ నెట్(UGCCSIR NET)/ గేట్(GATE)/ సీడ్(CEED) లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఉన్నవారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 8లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ప్రోగ్రామ్ వివరాలు..
* ఇఫ్లూ ప్రవేశాలు 2024
కోర్సులు...
➥ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
విభాగాలు: లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్ లిటరేచర్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, హిందీ, కంపారెటివ్ లిటరేచర్, ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్స్, ఆస్తేటిక్స్ అండ్ ఫిలాసఫీ, ఫిల్మ్ స్టడీస్ అండ్ విజువల్ కల్చర్, మీడియా అండ్ కమ్యూనికేషన్, కల్చరల్ స్టడీస్, అరబిక్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, జర్మన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, రష్యన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, స్పానిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్
➥ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్
విభాగాలు: టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ (పీజీడీటీఈ), ట్రాన్స్‌లేషన్ (పీజీడీటీ), టీచింగ్ ఆఫ్ అరబిక్(పీజీడీటీఏ).
అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించి యూజీసీ నెట్/యూజీసీ సీఎస్‌ఐఆర్ నెట్/ గేట్/ సీడ్ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఉన్నవారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
పరీక్ష విధానం..
➥ మొత్తం 70 మార్కులకు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1లో రిసెర్చ్ మెథడాలజీ 35 మార్కులు, సెక్షన్-2లో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు- 35 మార్కులు కేటాయించారు.
➥ మొత్తం 100 మార్కులకు పీజీ డిప్లొమా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ 50 మార్కులు, సెక్షన్-2లో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు- 50 మార్కులు కేటాయించారు. అరబిక్ సబ్జెక్టులకు సెక్షన్-1లో సంబంధిత విభాగం నుంచే ప్రశ్నలు అడుగుతారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 08.05.2024.
➥ EFLU ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: 08.06.2024.
పరీక్ష సమయం:
మొదటి సెషన్- ఉ. 9.00 గం. - మ.11.00 గంటల వరకు. (లేదా) ఉ. 9.00 గం. - మ.12.00 గంటల వరకు.
రెండో సెషన్ - మ. 2.00 గం. - సా. 4.00 గం. వరకు. (లేదా) మ. 2.00 గం. - సా. 5.00 గం. వరకు.