CBSE Results: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్ - త్వరలోనే 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు!
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.ఫలితాలకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎలాంటిప్రకటన రాలేదు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థల్లో ఫలితాలు నేడో, రేపో ఫలితాలు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఫలితాల విడుదలకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరోవైపు, మే రెండో వారం నాటికి ఫలితాలు వెల్లడించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు యోచిస్తున్నట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి. ఫలితాలు విడుదల చేసే తేదీ, సమయాన్ని గతేడాది మాదిరిగానే సీబీఎస్‌ఈ బోర్డు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించే అవకాశం ఉంది. సీబీఎస్ ఈ పదోతరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 16 వరకు కొనసాగగా.. 12వ తరగతి సమాధానపత్రాల మూల్యాంకనం మాత్రం ఏప్రిల్ చివరి వారంతో ముగిసినట్టు తెలుస్తోంది. ఈ రెండు తరగతుల ఫలితాలను కొద్ది గంటల వ్యవధి తేడాతోనే ఒకే రోజు విడుదల చేసే అవకాశం ఉంది.
విద్యార్థులు తమ రోల్ నెంబరు, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్ వివరాలను ఎంటర్ చేసి https://results.cbse.nic.in, https://www.cbse.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. అలాగే, మీ మొబైల్‌లో ఉమాంగ్, డిజీ లాకర్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఫలితాలు పొందొచ్చు.
ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5న వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీటిలో పదోతరగతి పరీక్షలకు 21 లక్షల మందికి పైగా విద్యార్థులకు పైగా హాజరు కాగా, 12వ తరగతి బోర్డు పరీక్షలను 16 లక్షల మంది విద్యార్థులకు పైగా హాజరయ్యారు. గతేడాది 12వ తరగతిలో 92.71శాతం, పదోతరగతిలో 94.40 శాతం ఉత్తీర్ణత నమోదైన విషయం తెలిసిందే. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు ఈ ఏడాది కూడా టాపర్ల జాబితాను విడుదల చేయడం లేదని సమాచారం.
Also Read:
TS పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
ఏపీ పాలిసెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్! పరీక్ష ఎప్పుడంటే?
ఏపీలోని పాలిటెక్నిక్‌లలో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే 'AP POLYCET - 2023' పరీక్ష హాల్‌టికెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మే 5 నుంచి పాలిసెట్ హాల్‌టికెట్లను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగనుంది. మే 25న పాలిసెట్ పలితాలను వెల్లడించనున్నారు. పాలిసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..