ఏపీ పాలిసెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్! పరీక్ష ఎప్పుడంటే?
మే 5 నుంచి పాలిసెట్ హాల్‌టికెట్లను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఏపీలోని పాలిటెక్నిక్‌లలో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే 'AP POLYCET - 2023' పరీక్ష హాల్‌టికెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మే 5 నుంచి పాలిసెట్ హాల్‌టికెట్లను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగనుంది. మే 25న పాలిసెట్ పలితాలను వెల్లడించనున్నారు. పాలిసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
పాలిసెట్ పాత ప్రశ్నపత్రాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం: పాలిసెట్ పరీక్షను పెన్ అండ్ పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్–50, ఫిజిక్స్–40, కెమిస్ట్రీ–30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానంలో అమల్లో లేదు.
ప్రవేశాలు కల్పించే సంస్థలు: పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
డిప్లొమా కోర్సులు: సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటలర్జికల్, కెమికల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
Also Read:
టీఎస్ పీజీఈసెట్ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్)-2023 దరఖాస్తును అధికారులు మే 5 వరకు పొడిగించారు. వాస్తవానికి దరఖాస్తు గడువు ఏప్రిల్ 30తో ముగియడంతో జేఎన్‌టీయూ-హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు దరఖాస్తు చేసుకొనేందుకు గడువును పొడిగించింది. దీంతో మే 5వరకు ఎలాంటి ఆలస్య రుసుం చెల్లించకుండానే విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగించే అవకాశం ఉండదని..అందువల్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీజీఈసెట్ కన్వీనర్ డా.బి.రవీంద్ర రెడ్డి సూచించారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఎంసెట్-2023 హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
ఎంసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..