TS POLYCET 2023: పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పడంటే?
తెలంగాణ పాలిసెట్ పరీక్షకు రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి.
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2023 నోటిఫికేషన్ జనవరి 11న వెలువడిన సంగతి తెలిసిందే. జనవరి 16న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే తాజాగా రూ.200 ఆలస్యరుసుముతో మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పాలిసెట్ ద్వారా డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, వెటర్నరి, హార్టికల్చర్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: polycet-te@telangana.gov.in లేదా 040 -23222192 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఈ సారి పాలిసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది దరఖాస్తు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు..
* టీఎస్ పాలిసెట్ (TS POLYCET) 2023
అర్హతలు..
ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంపార్ట్‌మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈసారి బాసర ఆర్‌జీయూకేటీ ఈ పరీక్షలో చేరడం లేదు.
ఫీజు పెంపు..
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు మే 17న నిర్వహించనున్న పాలిసెట్-2023 దరఖాస్తు రుసుం స్వల్పంగా పెంచారు. జనరల్, బీసీ విద్యార్థులకు ఇప్పటివరకు రూ.450 ఉండగా దాన్ని రూ.500లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గతంలో మాదిరిగానే రూ.250 రుసుమే ఉంది.
వీటిల్లో ప్రవేశాలు...
పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కోర్సులు.
పరీక్ష విధానం..
➥ మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పెన్ అండ్ పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో 150 ప్రశ్నలుంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. మ్యాథ్స్–60, ఫిజిక్స్–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
➥ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వీటి అనుబంధ సంస్థల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
వేర్వేరు ర్యాంకులు..
➥ పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్ చేస్తారు. టెక్నికల్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు.
పాలిటెక్నిక్ (టెక్నికల్): ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారి మార్కులు విధానం 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్–60, ఫిజిక్స్–30,కెమిస్ట్రీ–30 గా ఉంటాయి
అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ: అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మార్కుల విధానం కూడా 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్–(60/2=30)–30, ఫిజిక్స్–30, కెమిస్ట్రీ–30, బయాలజీలో 30 మార్కులుగా ఉంటాయి.
అర్హత మార్కులు..
➥ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు,
➥ వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు తప్పనిసరిగా స్కోర్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16.01.2023.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 24.04.2023.
➥ రూ.100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 25.04.2023.
➥ పాలిసెట్ పరీక్ష తేది: 17.05.2023.
➥ ఫలితాల వెల్లడి: పరీక్ష తర్వాత 10 రోజుల్లో ఫలితాల వెల్లడి.
POLYCET2023 Detailed Notification
POLYCET2023 Brief Notification
Also Read:
డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' (డీఎడ్) నోటిఫికేషన్ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్ & డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)-2023' నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..