అన్వేషించండి

ADCET 2023: ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్‌-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ & ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వివిధ ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏడీసెట్‌-2023 నోటిఫికేషన్ వెలువడింది.

కడపలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ & ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వివిధ ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్‌ & డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)-2023' నోటిఫికేషన్‌‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజైన్‌ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు...

* ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)-2023

అందించే కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ) ఇన్‌ పెయింటింగ్‌/ స్కల్ప్‌చర్‌/ యానిమేషన్‌/ అప్లయిడ్‌ ఆర్ట్స్‌/ ఫొటోగ్రఫీ. 

అర్హతలు: ఇంటర్మీడియెట్‌ (ఎంపీసీ/ ఎంఈసీ/ బైపీసీ/ఎంబైపీసీ/ సీఈసీ/ హెచ్‌ఈసీ) లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000, బీసీలకు రూ.750, ఎస్సీ/ ఎస్టీలకు రూ.500.

పరీక్ష విధానం..

➥ బీఎఫ్‌ఏ, బీడిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఒకే ఉమ్మడి ప్రశ్నపత్రం ఉంటుంది. ఆన్‌లైన్‌(సీబీటీ) విధానంలో మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఇస్తారు.

➥ జనరల్‌ నాలెడ్జ్, ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, అప్లయిడ్‌ ఆర్ట్స్‌లో టెక్నికల్‌ డిటైల్స్, పెయిటింగ్, స్కల్ప్‌చర్, యానిమేషన్, ఫొటోగ్రఫీ, డిజైన్‌ స్కిల్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35% గా నిర్ణయించారు. అంటే 100కు 35 మార్కులు వస్తేనే ప్రవేశాలు పొందడానికి అర్హులు.

పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు...

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 21.04.2023.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.05.2023.

➥ ఆలస్య రుసంతో దరఖాస్తులకు చివరితేది: 28.05.2023.

➥ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్: 31.05.2023.

Notification

Online Application

Website 

Also Read:

డీఈఈసెట్-2023 నోటిఫికేషన్‌ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్‌-2023' (డీఎడ్‌) నోటిఫికేషన్‌ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. 
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

టెక్నికల్‌ టీచర్స్‌ కోర్సుకు దరఖాస్తులు స్వీకరణ, చివరితేది ఎప్పుడంటే?
టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ 42 రోజుల సమ్మర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు (టీసీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌, హన్మకొండ, నిజామాబాద్‌, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో కోర్సుకు సంబంధించిన శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.ఆయా జిల్లా డీఈఓలను సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. మే 1 నుంచి జూన్‌ 11 వరకు కోర్సు శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్ల పేర్కొన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Advertisement

వీడియోలు

ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Mahanati Savitri : మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
Kiara Advani Sidharth Malhotra : కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
5 seater Cheapest car: 5 సీటర్ కార్లలో అత్యంత చవకైన మోడల్ ఏది? 30 వేల జీతం ఉన్నా కొనొచ్చు
5 సీటర్ కార్లలో అత్యంత చవకైన మోడల్ ఏది? 30 వేల జీతం ఉన్నా కొనొచ్చు
Vanara Movie Teaser : యుద్ధానికి 'వానర' సైన్యం సిద్ధం - వార్ ఎవరి కోసం?... సరికొత్తగా మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్
యుద్ధానికి 'వానర' సైన్యం సిద్ధం - వార్ ఎవరి కోసం?... సరికొత్తగా మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్
Embed widget