By: ABP Desam | Updated at : 03 Aug 2022 11:51 PM (IST)
cat registration 2022
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) ప్రవేశాలకు ఏటా నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT-2022) నోటిఫికేషన్‌ను ఐఐఎం-బెంగళూరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా నవంబరు 27న నిర్వహించనున్న క్యాట్-2022 పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3నుంచి ప్రారంభంకానుంది. సెప్టెంబరు 14 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 27 నుంచి పరీక్ష రోజు వరకు అడ్మిట్ కార్డులు(హాల్‌టికెట్లు) అందుబాటులో ఉండనున్నాయి.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ విధానంలో ఫీజు చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఏవైనా ఆరు నగరాలను ప్రాధాన్యాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాతే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు.
Also Read: MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’
ఈ ఏడాది నవంబరు 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 150 నగరాల్లో CAT-2022 పరీక్ష నిర్వహించనున్నారు. దీనిద్వారా దేశంలోని 20 ఐఐఎంలలో ప్రవేశాలు కల్పించనున్నారు.
Also Read: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల - సబ్జెక్టులు, పూర్తి వివరాలు!
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా. పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
పరీక్ష ఇలా..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 గంటలపాటు సాగనుంది. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటి నుంచి 66 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాల సమయం చొప్పున 120 నిమిషాల సమయం ఉంటుంది. దివ్యాంగులకు 13 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. క్యాంట్ స్కోరుకు 2023 డిసెంబరు 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
*సెక్షన్-1: వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ - 24 ప్రశ్నలు – 72 మార్కులు
* సెక్షన్-2: డేటా ఇంటర్ ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ - 20 ప్రశ్నలు – 60 మార్కులు
* సెక్షన్-3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ - 20 ప్రశ్నలు – 60 మార్కులు.
Also Read: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 200 ఉద్యోగాలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు ఫీజు: రూ.2,300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1,150.
ముఖ్యమైన తేదీలు..
Important CAT 2022 Disclaimers
మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...
CLAT 2023: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2023, దరఖాస్తు చేసుకోండి!
CA Result: నేడే సీఏ ఫౌండేషన్ ఫలితాలు, ఇక్కడ చూసుకోండి!
AP ECET: రేపు ఏపీ ఈసెట్ ఫలితాలు, ఇలా చూసుకోండి!
JEE Advanced 2022 Registration: జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
AP ICET 2022 Results: ఏపీ ఐసెట్ - 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!
Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?
Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే
Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా
Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక