OU PhD Notification 2022: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల - సబ్జెక్టులు, పూర్తి వివరాలు!
పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 18 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 17 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను ఆగస్టు 1న విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో పీహెచ్‌డీ ప్రవేశాలను రెండు కేటగిరీలలో నిర్వహించనున్నారు. కేటగిరీ-I కింద ప్రవేశాలకు ఏదైనా జాతీయస్థాయి ఫెలోషిప్ పొందిన వారు అర్హులు. దీనికి అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6లోగా సంబంధిత డీన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. ఇతర సమాచారం కోసం, అభ్యర్థులు సంబంధిత డీన్ల కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఇక కేటగిరీ-II కింద ప్రవేశాలకు అభ్యర్థులు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలివే..:
పరీక్ష రాసేందుకు రెగ్యులర్ లేదా దూరవిద్యలో జనరల్ విద్యార్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Also Read: ఆగస్టు 3 నుంచి క్యాట్-2022 దరఖాస్తులు - అర్హతలు, ముఖ్యతేదీలివే!
18 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 18 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 17 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. రూ.1000 అపరాధ రుసుంతో సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
పరీక్ష విధానం:
ఆన్‌లైన్ విధానంలో పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 70 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రధానంగా అనలాగిస్, క్లాసిఫికేషన్, మ్యాచింగ్, కాంప్రహెన్షన్ ఆఫ్ రిసెర్చ్ స్టడీ/ ఎక్స్‌పరిమెంట్/థిరీటికల్ కోణంలో ప్రశ్నలు ఉంటాయి. ప్రవేశ పరీక్ష సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నలు అడుతుతారు. లాంగ్వేజ్ సబ్జెక్టులు మినహా మిగతా అన్ని సబ్జెక్టులకు ఇంగ్లిష్‌లోనే పరీక్ష నిర్వహిస్తారు.
Also Read: MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’
ప్రవేశ పరీక్ష-సబ్జెక్టులు:
ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్: ఆర్కియోలజీ, ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్, పర్షియన్, ఫిలాసఫీ, సంస్కృతం.
ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటెల్ లాంగ్వేజెస్: అరబిక్, తెలుగు.
ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్: ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ.
ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్: కామర్స్.
ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్: ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్.
ఫ్యాకల్టీ ఆఫ్ లా: లా.
ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్: అప్లైడ్ కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్, జియోగ్రఫీ, జియోలజీ, జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, కంప్యూటర్ సైన్స్.
ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్: బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్.
ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ: కెమికల్ టెక్నాలజీ/కెమికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ.
ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్‌ఫర్మాటిక్స్: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ.
అర్హత మార్కులు: పీహెచ్‌డీ ప్రవేశపరీక్షలో అర్హత మార్కులను 50% (35 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45% (32 మార్కులు)గా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.08.2022.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.9.2022.
- రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 24.9.2022.