By: ABP Desam | Updated at : 01 Apr 2023 08:40 PM (IST)
Edited By: omeprakash
ఏపీ ప్రెస్ అకాడమీ - డిప్లొమా కోర్సు
ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు మార్చి 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ విద్యార్హత ఉండి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారు లేదా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా జర్నలిస్టులు రూ.1500, ఇతరులు రూ.2000 చెల్లించి ఏప్రిల్ 15లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలోనే దరఖాస్తులు సమర్పించాలి. ఎంపికైన వారికి మే నెలలో కోర్సు ప్రారంభిస్తారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఫోన్: 9154104393, (లేదా) ఈమెయిల్: pressacademycontact@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
వివరాలు...
➥ డిప్లొమా ఇన్ జర్నలిజం
కోర్సు వివరాలు: 6 నెలలపాటు కోర్సు ఉంటుంది. కోర్సుకు ఎంపికైనవారికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించి, డిప్లొమా సర్టిఫికేట్‌ను ప్రదానం చేస్తుంది.
అర్హత: జర్నలిస్టులకు ఇంటర్, ఇతరులకు డిగ్రీ అర్హత ఉండాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ రంగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు లేదా జర్నలిజంపై ఆసక్తి, అభిరుచి ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ డిప్లొమా కోర్సులో చేరడానికి అర్హులు.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి వర్తించదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ''The Secretary, Press Academy of Andhra Pradesh, Vijayawada'' పేరుతో డిడి తీయాలి. డిడి వివరాలను దరఖాస్తులో నమోదుచేయాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. దరఖాస్తుతోపాటు అభ్యర్థులు తమ సర్వీస్ సర్టిఫికేట్/ ఐడీ కార్డు/ అక్రిడియేషన్ కార్డు జతచేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
దరఖాస్తు ఫీజు: జర్నలిస్టులు రూ.1500, ఇతరులు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Secretary, Press Academy of Andhra Pradesh
# 40-6/4-8,4th floor, Revenue colony, Moghalrajpuram,
Vijayawada, Andhra Pradesh – 520 010
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 31.03.2023.
➥ దరఖాస్తు చివరి తేదీ: 15.04.2023.
Also Read:
పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!
దేశవ్యాప్తంగా పీఎంశ్రీ (స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద 9 వేల పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, అధునాతన స్కూల్స్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలవిద్యను తీర్చి దిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 2.5 లక్షల పాఠశాలల నుంచి దరఖాస్తులు రాగా.. వీటిలో నుంచి 9 వేలను ఎంపిక చేసింది. ఆహ్లాదకర వాతావరణం, ఆధునికపద్ధతుల్లో బోధన ఉంటే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చనేది కేంద్రం యోచన.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్ ఎప్పుడంటే?
Cyber Security: డిగ్రీలో 'తప్పనిసరి' సైబర్ సెక్యూరిటీ కోర్సు - ఉన్నత విద్యామండలి నిర్ణయం!
Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?
Medical Colleges: దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
CTET Exam Date: సీటెట్ (జులై) - 2023 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!