అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP TET 2024: ఏపీటెట్(జులై)-2024 ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

AP TET 2024 Exam Fee: ఏపీటెట్ జులై - 2024 పరీక్ష కోసం అభ్యర్థులు జులై 3 నుంచి జులై 16 వరకు ఫీజు చెల్లింవచ్చు. ఫీజు చెల్లించినవారు జులై 4 నుంచి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది

APTET July 2024 Fee Payment: ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీటెట్ జులై-2024 నోటిఫికేషన్ జులై 1న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఫీజు చెల్లింపు ప్రక్రియ జులై 3న ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 16 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన అభ్యర్థులు జులై 4 నుంచి 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్లు: 9505619127, 9705655349, 8121947387, 8125046997 ద్వారా సంప్రదింవచ్చు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 25 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఇక ఆగస్టు 5 నుంచి 20 వరకు ఏపీటెట్ (జులై) పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. 

పరీక్ష విధానం: ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు. పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 60 మార్కులు, బీసీలకు  50 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతం ఉంటే సరిపోతుంది.

టెట్ ప్రాథమిక 'కీ' ఆగస్టు 10న విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై ఆగస్టు  11 నుంచి 21 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఆగస్టు 25న టెట్ తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. టెట్‌ తుది ఫలితాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థుల సౌకర్యార్థం జులై 16 నుంచి మాక్ టెస్టులు అందుబాటులో ఉండనున్నాయి.

ముఖ్యమైన తేదీలు..

➥ AP TET - జులై -2024 నోటిఫికేషన్ వెల్లడి: 02.07.2024.

➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 03.07.2024 -16.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.07.2024 - 17.07.2024.

➥ ఆన్‌లైన్ మాక్ టెస్టులు అందుబాటులో: 16.07.2024 నుంచి.

➥ టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 25.07.2024 నుంచి 

➥ టెట్ పరీక్ష షెడ్యూలు: 05.08.2024 - 20.08.2024.  {పేపర్-1(ఎ) & పేపర్-1(బి), పేపర్-2(ఎ) & పేపర్-2(బి)}

➥ టెట్ ప్రాథమిక 'కీ' విడుదల: 10.08.2024.

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 11.08.2024 - 21.08.2024.

➥ టెట్ ఫైనల్ కీ: 25.08.2024.

➥ టెట్ ఫలితాల వెల్లడి: 30.08.2024.

 AP TET JULY 2024 Fee Payment

APTET July 2024 - నోటిఫికేషన్, పరీక్ష సిలబస్, పరీక్ష విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..

అప్పటి డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు..
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను.. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం 6,100 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. దాన్ని రద్దుచేసిన ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించనుంది. టెట్ నోటిఫికేషన్ జులై 1న విడుదలకాగా.. వారంరోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకానుంది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget