News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP SSC Exams: ఏపీలో జూన్‌ 2 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 2 నుంచి 10 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

FOLLOW US: 
Share:

ఏపీలో పదోతరగతి అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 2 నుంచి 10 వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.

పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 2,12,221 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరూ హాల్‌‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ పేరు, జిల్లాపేరు, స్కూల్ వివరాలు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. జవాబు పత్రాల ముల్యాంకనం జూన్‌ 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. జూన్ చివరివారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

పదోతరగతి హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

పరీక్షల షెడ్యూలు ఇలా..

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 

జూన్ 2న: తెలుగు పరీక్ష

జూన్ 3న: హిందీ పరీక్ష

జూన్ 5న: ఇంగ్లిష్ పరీక్ష

జూన్ 6న: గణితం పరీక్ష

జూన్ 7న: సైన్స్ (ఫిజికల్ సైన్స్, బయాలజీ) పరీక్ష

జూన్ 8న: సోషల్ స్టడీస్ పరీక్ష

జూన్ 9న: కాంపోజిట్ విద్యార్థులకు పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-1 పరీక్ష

జూన్ 10న: ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్ష. 

ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 6న ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,64,152 మంది హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఏప్రిల్‌ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం నిర్వహించారు. అనంతరం ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది కంటే 5 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పాస్ పర్సంటేజ్‌ పెరిగింది. అది 3.47 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉంది. ఆ జిల్లాలో పాస్‌ పర్సంటేజ్‌ 87.4 శాతం ఉంది. అతి తక్కువ ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా వెనుకబడింది. అక్కడ పాస్ పర్సంటేజ్‌ 60.39శాతం. ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పదో తరగతిలో పాస్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 938 స్కూల్స్‌ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. 38 స్కూల్స్‌లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. గతంలో పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు రెండేసి పేపర్లు ఉండేవి ఈసారి మాత్రం ఒక పేపర్‌ విధానం తీసుకొచ్చారు. ఈ పరీక్షలకు 6,09,081 మంది రెగ్యులర్‌ విద్యార్థులు అప్లై చేసుకోగా... అందులో6,05,052 మంది మాత్రమే పరీక్షలు రాశారు. పరీక్షకు హాజరైన వారిలో 3,09,245 మంది బాయ్స్‌ ఉంటే...  2,95,807 మంది బాలికలు ఉన్నారు. 

Also Read:

తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వెలువడింది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. కాంపొజిట్ పేపర్లకు మాత్రం మధ్యాహ్నం 12.50 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 31 May 2023 11:52 AM (IST) Tags: Education News in Telugu AP Tenth Exams Tenth Supplimentary Exams AP SSC Advance Supplimentary Exams Tenth Supplimentary Exams HallTickets

ఇవి కూడా చూడండి

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష

Cyber Security Course: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు

Cyber Security Course: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు

Fake Universities: దేశంలో నకిలీ యూనివర్సిటీల జాబితా వెల్లడి, ఏపీలో రెండు 'ఫేక్' వర్సిటీలు

Fake Universities: దేశంలో నకిలీ యూనివర్సిటీల జాబితా వెల్లడి, ఏపీలో రెండు 'ఫేక్' వర్సిటీలు

AP EDCET: బీఎడ్ కౌన్సెలింగ్, జాబితా నుంచి 18 కళాశాలలు తొలగింపు

AP EDCET: బీఎడ్ కౌన్సెలింగ్, జాబితా నుంచి 18 కళాశాలలు తొలగింపు

APBIE: ఇంటర్‌ విద్యార్థులకు 'స్టడీ అవర్స్', వారికి 'హాజరు' ఫీజు గడువు నవంబరు 30 వరకు

APBIE: ఇంటర్‌ విద్యార్థులకు 'స్టడీ అవర్స్', వారికి 'హాజరు' ఫీజు గడువు నవంబరు 30 వరకు

టాప్ స్టోరీస్

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన  రౌస్ అవెన్యూ కోర్ట్ !

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌