News
News
వీడియోలు ఆటలు
X

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,09,070 మంది ఉన్నారు.

FOLLOW US: 
Share:

పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆరు పేపర్ల విధానం ఇప్పుడు విద్యార్థులకు కత్తి మీద సాములా మారింది. ఒకేసారి కొండంత సిలబస్ చదివి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఏడు పేపర్ల విధానంలో పరీక్ష నిర్వహించగా, ప్రస్తుతం తొలిసారి ఆరు పేపర్లతో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నాపత్రం ఉంటుంది. గత విద్యాసంవత్సరం ఎక్కువ మంది పదోతరగతి పరీక్ష తప్పడానికి పేపర్ల సంఖ్య తగ్గడమూ ఒక కారణమైంది. 

ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు కరోనా సమయంలో వారి కింది తరగతుల్లో అభ్యసనను నష్టపోయారు. ఈ అంతరాన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఉపాధ్యాయులు ప్రయత్నించినప్పటికీ చాలామంది విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోలేకపోయారు. సీబీఎస్ఈ విధానంలో ఐదు పేపర్లు ఉన్నా.. ఆ విద్యార్థులకు 20 శాతం అంతర్గత మార్కులతోపాటు ప్రశ్నాపత్రంలోనే 20 మార్కులు మల్టిపుల్ ఛాయిస్ కావడం వెసులుబాటునిస్తుంది. రాష్ట్ర బోర్డుకు వచ్చేసరికి అంతర్గత మార్కుల విధానం లేదు. వంద మార్కులకు పూర్తిగా రాత పరీక్షే నిర్వహిస్తారు. ఒక మార్కు ప్రశ్నకు జవాబు రాయాల్సిందే.

పదోతరగతి హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

సైన్స్ పేపర్ 'ఒక్కటే'..
గతేడాది వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక పేపర్, బయాలజీకి మరో పేపర్ ఉండేది. ప్రస్తుతం సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు కలిపి ఒకే ప్రశ్నాపత్రం ఉంటుంది. జీవశాస్త్రాన్ని ప్రశ్నాపత్రంలోనే ప్రత్యేక సెక్షన్‌గా విభజిస్తారు. భౌతిక, రసాయనశాస్త్రాల్లో 12, జీవశాస్త్రంలో 10 అధ్యాయాలున్నాయి. ఇవికాకుండా పర్యావరణ విద్య సబ్జెక్టులో చిన్నచిన్న పాఠాలు 22 వరకున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన బ్లూప్రింట్ ప్రకారం జీవశాస్త్రం నుంచి 17 ప్రశ్నలు, భౌతిక, రసాయన శాస్త్రాలనుంచి 16 ప్రశ్నలు ఇస్తారు. నాలుగో సెక్షన్‌లో ఇచ్చే ఎనిమిది మార్కుల ప్రశ్నలు అయిదింటికి తప్ప ఎక్కడా ఛాయిస్ లేదు. సాంఘిక శాస్త్రంలోనూ భూగోళం, చరిత్ర, ఆర్థిక, పౌరశాస్త్రాల్లో కలిపి 22 అధ్యాయాలున్నాయి. గతంలో 11 పేపర్ల విధానం ఉన్నప్పుడు ఒక రోజు పరీక్ష బాగా రాయకపోతే మరో రోజు ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు అవకాశం ఉండేది.

విద్యార్థులకు అలర్ట్..

➥ విద్యార్థులు సమాధానాలు రాసేందుకు మొదట 24 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. అదనంగా సమాధాన పత్రాలు అవసరమైతే 12 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. 

➥ సైన్స్ పరీక్షకు మాత్రం ఫిజిక్స్-కెమిస్ట్రీ జవాబులు రాసేందుకు 12 పేజీల బుక్‌లెట్, బయాలజీకి మరో 12 పేజీల బుక్‌లెట్ విడివిడిగా ఇస్తారు.

➥గతేడాది ప్రశ్నపత్రాలు వాట్సాప్‌ల్లో వచ్చినందున ఈసారి ఎవరూ పరీక్ష గదుల్లోకి ఫోన్ తీసుకెళ్లకూడదనే నిబంధనను విధించారు.

పరీక్షలకు 6.6 లక్షల మంది..
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,09,070 మంది ఉన్నారు. పరీక్షలు రాసేవారిలో బాలురు - 3,11,329, బాలికలు- 2,97,741 మంది ఉన్నారు. ఇక సప్లిమెంటరీ విద్యార్థులు 53,410 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరితోపాటు ప్రైవేటు విద్యార్థులు 1524 మంది, ప్రైవేటు సప్లిమెంటరీ విద్యార్థులు - 147 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో 682 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

ప్రశ్నపత్ర స్వరూపం ఇలా..

సెక్షన్ ప్రశ్నలు స్వరూపం మార్కులు
1 12 సూక్ష్మ లఘు ప్రశ్నలు 12
2 8 తేలికపాటి ప్రశ్నలు 16
3 8 లఘు ప్రశ్నలు 32
4 5 వ్యాసరూప ప్రశ్నలు 40
మొత్తం 33       ------------- 100

మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్స్ లింక్ కోసం క్లిక్ చేయండి.. 

ఏపీ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

పరీక్షల షెడ్యూలు ఇలా..

పరీక్ష తేదీ పేపరు
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8 ఇంగ్లిష్
ఏప్రిల్ 10 మ్యాథమెటిక్స్
ఏప్రిల్ 13 సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 17 కాంపోజిట్ కోర్సు
ఏప్రిల్ 18 ఒకేషనల్ కోర్సు

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 29 Mar 2023 10:34 AM (IST) Tags: AP SSC exams ap tenth class exams Education News in Telugu AP Tenth Exams Tenth Class Exam Centers

సంబంధిత కథనాలు

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

Cyber Security: డిగ్రీలో 'తప్పనిసరి' సైబర్‌ సెక్యూరిటీ కోర్సు - ఉన్నత విద్యామండలి నిర్ణయం!

Cyber Security: డిగ్రీలో 'తప్పనిసరి' సైబర్‌ సెక్యూరిటీ కోర్సు - ఉన్నత విద్యామండలి నిర్ణయం!

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Medical Colleges: దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

Medical Colleges: దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CTET Exam Date: సీటెట్ (జులై) - 2023 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

CTET Exam Date: సీటెట్ (జులై) - 2023 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!