AP Inter 1st Year Results 2022: ఏపీ ఇంటర్ ఫస్టియర్‌లో 54 శాతం పాస్, ఈ ఏడాది బాలికలే టాప్
AP Inter 1st Year Results 2022: ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4 లక్షల 45 వేల 604 మంది హాజరుకాగా, 2,41,591 మంది ఉత్తీర్ణత సాధించారు.
![AP Inter 1st Year Results 2022: ఏపీ ఇంటర్ ఫస్టియర్‌లో 54 శాతం పాస్, ఈ ఏడాది బాలికలే టాప్ AP Intermediate 1st Year Results 2022 Interm 1st Year Results Declared Today Check at bie.ap.gov.in AP Inter 1st Year Results 2022: ఏపీ ఇంటర్ ఫస్టియర్‌లో 54 శాతం పాస్, ఈ ఏడాది బాలికలే టాప్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/22/52285c52d1b440d2c5d88d5970d39ac9_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Inter 1st Year Results 2022: దాదాపు రెండేళ్లు కరోనాతో పరీక్షలు నిర్వహణ సాధ్యం కాలేదు. వైరస్ వ్యాప్తి తగ్గి, క్లాసులు నిర్వహించిన ఏపీ విద్యా శాఖ ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించి నేడు ఫలితాలు విడుదల చేసింది. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4 లక్షల 45 వేల 604 మంది హాజరుకాగా, 2,41,591 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 2,58,449 మంది విద్యార్థులు పాసయ్యారు. ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బాలికలే టాప్‌లో నిలిచారు.
ఓవరాల్‌గా ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు శాతాల్లో చూస్తే.. ఉమ్మడి కృష్ణా జిల్లా 72 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించగా, 50 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత శాతం ఫలితాలతో ఉమ్మడి కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. బాలుర అత్యధిక ఉత్తీర్ణత ఉమ్మడి కృష్ణా జిల్లా 66 శాతం కాగా, ఉమ్మడి కడప జిల్లా 34 శాతంతో బాలురు అత్యల్ప ఉత్తీర్ణత శాతం సాధించారు. 72 శాతంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాలికల అత్యధిక ఉత్తీర్ణత సాధించగా.. ఉమ్మడి కడప జిల్లా 47 శాతం బాలికలే పాస్ అయ్యారు.
ఏపీ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://telugu.abplive.com/exam-results/ap-board-result-62b2b1aa8d556.html
ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html
ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్
https://telugu.abplive.com/exam-results/ap-intermediate-first-year-vocational-result-62b2b8e1b5a02.html
ఏపీ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్
https://telugu.abplive.com/exam-results/ap-inter-2nd-year-vocational-result-62b2b9fd5344a.html
జూన్ 25వ తేదీ నుంచి జులై 5 వరకు రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 3 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రాక్టికల్స్ ఆగస్టు 17 నుంచి ఆగస్టు 22 వరకు నిర్వహించనున్నారు. జూలై 8వ తేదీ వరకు ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు.
గత 5 ఏళ్లుగా పాస్ శాతం ఇలా..
మార్చి 2017లో ఫస్టియర్‌లో 64 శాతం పాస్ కాగా, సెకండియర్‌లో 73 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
మార్చి 2018లో ఫస్టియర్‌లో 62 శాతం పాస్ కాగా, సెకండియర్‌లో 69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
మార్చి 2019లో ఫస్టియర్‌లో 60 శాతం పాస్ కాగా, సెకండియర్‌లో 59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
మార్చి 2020లో ఫస్టియర్‌లో 59 శాతం పాస్ కాగా, సెకండియర్‌లో 73 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
మార్చి 2021లో ఫస్టియర్‌లో 100 శాతం పాస్ కాగా, సెకండియర్‌లో 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
మే 2022లో ఫస్టియర్‌లో 54 శాతం పాస్ కాగా, సెకండియర్‌లో 61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
Also Read: AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)