News
News
వీడియోలు ఆటలు
X

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

ఏపీ ఇంటర్ఇంగ్లిష్ మీడియం పేపర్లో తప్పులు దొర్లినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలపుతామని బోర్డు ప్రకటించింది.

FOLLOW US: 
Share:

రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మార్చి 27న సెకండియర్ ఫిజిక్స్ పరీక్ష నిర్వహించారు. దీనిలో ఇంగ్లిష్ మీడియం పేపర్లో తప్పులు దొర్లినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలపుతామని బోర్డు ప్రకటించింది. ఫిజిక్స్ పేపర్ 2లోని మూడో ప్రశ్న తప్పుగా ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది.

తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో మూడో ప్రశ్నగా ఆయస్కాంత ప్రవణత(అవపాతము)ను నిర్వచించుము? అని రాగా, ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో డిఫైన్ మ్యాగ్నటిక్ డెక్లినేషన్ అని తప్పుగా ప్రచురితమైంది. దానికి బదులుగా డిఫైన్ మ్యాగ్నటిక్ ఇన్‌క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అని రావాల్సి ఉంది. దీనికి పరీక్ష కేంద్రాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి సందేశాలు పంపించారు.

కొన్నిచోట్ల ఆ విషయం విద్యార్థులకు చెప్పగా, మరికొన్నిచోట్ల ఆ విషయం వారికి చేరలేదు. నంద్యాల జిల్లా డోన్ పట్టణ సమీపంలోని ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు నిర్వాహకులు ఈ విషయం చెప్పకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తప్పుగా వచ్చిన ప్రశ్నకే తాము సమాధానం రాశామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్న తప్పుగా రావడాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంటర్మీడియట్ రెండో ఏడాది భౌతికశాస్త్రం పరీక్షలో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు రెండు మార్కులను కలపనున్నారు. ప్రశ్నపత్రంలోని మూడో ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు ఇవ్వాలని ఇంటర్ విద్యామండలి నిర్ణయించింది.

మార్చి 16 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు, ఏప్రిల్‌ 30 నుంచి మే 10వరకు నిర్వహించనున్నారు. రోజూ రెండు విడతల్లో ఆదివారం కూడా జరుగుతాయి.

ఈఏడాది రాష్ట్రంలో  మొత్తం 10,03,990 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 4,84,197 మంది ఉండగా.. సెకండియర్ విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. 1,489 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

Also Read:

సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'టెన్త్' విద్యార్థులకు గుడ్ న్యూస్, కొత్త మోడల్ పేపర్లు వచ్చేశాయ్! ఇక 'ఛాయిస్' మీదే!
తెలంగాణలో పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త మోడల్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయి. టెన్త్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో మార్పులకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులతో కొత్త మోడల్‌ పేపర్లను విడుదల చేసింది. ఎన్‌సీఈఆ‌ర్‌టీ అధికారిక వెబ్‌సైట్‌లో మోడల్ పేపర్లను అందుబాటులో ఉంచింది. త్వరలోనే పాఠశాలలకు కొత్త మోడల్ పేపర్లు, బ్లూప్రింట్‌ను ప్రభుత్వం సరఫరా చేయనుంది.
పదోతరగతి మాదిరి ప్రశ్నపత్రాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 28 Mar 2023 10:25 AM (IST) Tags: AP Inter exams Education News in Telugu Inter Physics Paper Mistakes in Physics Paper

సంబంధిత కథనాలు

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!

CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు