Andhra Pradesh Latest News: ఏపీలో ప్రతి పంచాయతీలో మోడల్ స్కూల్, కానీ కండిషన్స్ అప్లై...
Andhra Pradesh Latest News: 60 మంది విద్యార్థులు ఉన్న ప్రతి స్కూల్‌ను మోడల్ స్కూల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతకంటే తక్కువ ఉంటే వాటిని ఫౌండేషన్ స్కూల్‌గా మార్చేస్తారు.

Andhra Pradesh Latest News: స్కూల్ ఏజ్ ఉన్న ప్రతి పిల్లాడు స్కూల్‌కు వెళ్లి చదువుకునేలా ప్రోత్సహించాలని అందుకు తగ్గట్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రతి గ్రామపంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఉండాలని ప్లాన్ చేస్తోంది. అంటే ఈ లెక్క రాష్ట్రవ్యాప్తంగా 13వేల బడులు మోడల్ స్కూల్స్‌గా మారనున్నాయి. దీనికి ప్రభుత్వం ఓ కండిషన్ కూడా పెట్టింది. మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే కనీసం ఆ పాఠశాలలో 60 మంది పిల్లలు ఉండాలని చెబుతోంది. అరవై మంది లేని ప్రాంతాల్లో ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేసి 1,2 తరగతలకు మాత్రమే పాఠాలు బోధిస్తారు.
ఆయా పంచాయతీల పరిధిలో అంగన్‌వాడీను అప్‌గ్రేడ్ చేసి వాటిని ఫౌండేషన్ స్కూల్స్‌గా తీర్చిదిద్దనున్నారు. వీటితోపాటు ఒకటి నుంచి 8వ తరగతి ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను 60 మంది లోపు విద్యార్థులు ఉంటే వాటిని విలీనం చేయనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ మార్పులు చేర్పులు జరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఏపీలో 5 రకాల బడులు ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల సంఖ్యను ఆధారంగా బడులు డివైడ్ చేసి పాఠాలు బోధిస్తారు. ఎక్కడైనా ప్రాథమిక పాఠశాలలో అరవై కంటే ఎక్కువ మంది విద్యారర్థులు చదువుతుంటే వాటిని ఆదర్శ పాఠశాలగా మారుస్తారు. అదే 120 మంది ఉంటే ఓ హెడ్మాస్టర్‌ను నియమిస్తారు. 150 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే 30 మందికి ఒకరు చొప్పున ఉపాధ్యాయులను కేటాయిస్తారు.
పైన చెప్పిన లెక్క ప్రకారం ఏపీలో 33 వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో 13వేల స్కూల్స్‌ను ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. వాటిని మోడల్ స్కూల్స్‌గా మార్చనుంది. మిగిలిన బడులను ఫౌండేషన్ స్కూల్స్‌గా మార్చేయనున్నారు. నాలగువేలకుపైగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో నాలుగు వేల పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు.
గతంలో వైసీపీ అధికారంలో చేపట్టిన విధానంతో విద్యార్థుల అనేక ఇబ్బందులు పడ్డారని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆరోపించారు. ఇకపై విద్యార్థలకు ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నట్టు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉత్తమమైన విధానాలు అనుసరించి కొత్త జాతీయ విద్యావిధానానికి అనుగుణంకా చర్యలుతీసుకుంటున్నట్టు వెల్లడించారు. వైసీపీ విధానాలతో చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమైపోయారని అన్నారు. ఇకపై ఇలాంటివి జరగకూడదన్న ఉద్దేశంతోనే వినూత్న పంథాలో విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులపై ప్రయోగాలు చేసి వారి భవిష్యత్‌ను నాశనం చేయదలుచుకోలేదని లోకేష్ చెప్పారు.
గతంలో 117 జీవో తీసుకొచ్చిన వైసీపీ సర్కారు విద్యార్థులను ఇబ్బంది పెట్టిందన్నారు లోకేష్. ఆ జీవోను రద్దు చేసి వాటి ప్లేస్‌లో మోడల్ స్కూల్స్ తీసుకొస్తున్నామని ఎక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే అక్కడ ఈ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇప్పుడు తీసుకొచ్చే కొత్త విధానంతో దూర ప్రాంతాలకు విద్యార్థు వెళ్లడం కష్టంతో కూడుతున్న పనిగా విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విలీన ప్రక్రియ వల్ల ఉపాధ్యాయుల విషయంలో సమస్యలు ఎదరౌవతాయని సూచిస్తున్నారు. అలాంటి సమస్యల్లేకుండా ఉండేలా జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని హితవు పలుకుతున్నారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

