AP EdCET 2021 exam: నేడే ఏపీ ఎడ్‌సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
AP EdCET 2021 exam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్‌సెట్ పరీక్షను నేటి (సెప్టెంబర్ 21) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కె.విశ్వేశ్వరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్ ) - 2021 పరీక్ష మంగళవారం (సెప్టెంబర్ 21) నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కె.విశ్వేశ్వరరావు వెల్లడించారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో (ఆబ్జెక్టివ్ ఫార్మెట్) పరీక్ష ఉంటుందని చెప్పారు. ఎడ్‌సెట్ పరీక్ష కోసం 69 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 15,638 మంది ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఉర్దూ మీడియం వాళ్లకు ప్రత్యేకంగా కర్నూలులో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షకు నిమిషం నిబంధన అమలులో ఉందని.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ సహా మరిన్ని వివరాల కోసం ఎడ్‌సెట్ అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in ను సంప్రదించవచ్చు.
గంట ముందే అనుమతిస్తాం..
పరీక్ష సమయానికి గంట ముందు నుంచి అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ కె.విశ్వేశ్వరరావు వెల్లడించారు. ఎగ్జామ్ సెంటర్, డేట్, టైమ్ వివరాలను అభ్యర్థులకు ఎస్ఎంఎస్ (మెసేజ్) రూపంలో పంపిస్తామని తెలిపారు. ఏపీ ఎడ్‌సెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ ఎడ్‌సెట్ హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోండిలా..
1. ఎడ్‌సెట్ అధికారిక వెబ్ సైట్ sche.ap.gov.in ను ఓపెన్ చేయండి.
2. ఇందులో EDCET 2021 అని ఉన్న ఆప్షన్ క్లిక్ చేయండి.
3. దీంతో మరో విండో ఓపెన్ అవుతుంది. ఇందులో డౌన్‌లోడ్ హాల్ టికెట్ అనే లింక్ కనిపిస్తుంది. దీనిని ఎంచుకోండి.
4. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
5. దీంతో హాల్ టికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
6. భవిష్యత్ అవసరాల కోసం దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
24 నుంచి ఏపీ పీఈసెట్..
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా బీపీఈడీ (BPEd), యూజీడీపీఈడీ (UGDPEd) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీఈసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) 2021 ప్రవేశ పరీక్షను ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ వెల్లడించారు. ఈ నెల 24 నుంచి 26 వరకు పురుష అభ్యర్థులకు.. 27న మహిళా అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కోర్సుల్లో ప్రవేశాలకు 1,857 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
Also Read: AP LAWCET 2021: ఏపీ లాసెట్ హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Also Read: IGNOU July 2021: ఇంటి నుంచే డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్నారా? 'ఇగ్నో' గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది..