AP LAWCET 2021: ఏపీ లాసెట్ హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Andhra Pradesh Law Common Entrance Test- 2021: ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 పరీక్షను ఈ నెల 22న నిర్వహించనున్నారు. లాసెట్ హాల్ టికెట్లు నిన్న విడుదల అయ్యాయి. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్- LAWCET), పీజీఎల్ సెట్ (PGLCET) పరీక్షలను సెప్టెంబర్ 22వ తేదీన నిర్వహించనున్నారు. లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు నిన్న (సెప్టెంబర్ 17న) విడుదలయ్యాయి. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు sche.ap.gov.in నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ లాసెట్ 2021 హాల్ టికెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
- ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- హోం పేజీలో 'AP LAWCET 2021' అనే టాబ్ ఉంటుంది. దీనిని క్లిక్ చేస్తే.. AP LAWCET & AP PGLCET పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది.
- ఈ హోం పేజీలో 'Download Hall Ticket' అనే ఆప్షన్ ఎంచుకోండి. (డైరెక్టుగా హాల్ టికెట్ల డౌన్ లోడ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- ఇక్కడ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఫోన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఇచ్చి.. Download Hall Ticket మీద క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్లు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- 22న జరగనున్న పరీక్షలతో పాటు భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.
తెలంగాణ లాసెట్‌లో 68.84 శాతం ఉత్తీర్ణత..
తెలంగాణలోని లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. లాసెట్ పరీక్షలో 68.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్ష కోసం 39,805 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29,629 మంది పరీక్షకు హాజరవ్వగా.. 20,398 మంది అర్హత సాధించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. పీజీఎల్ సెట్ పరీక్ష కోసం 39,805 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 29,629 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 20,398 మంది అర్హత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణతా శాతం 68.84గా నమోదైందని వెల్లడించారు.
Also Read: AP Degree Admissions: నేటి నుంచి ఏపీలో డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ.. పూర్తి షెడ్యూల్ ఇదే..