అన్వేషించండి

UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే

UGC NET June 2026: యూజీసీ నెట్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహించే ఒక కీలకమైన జాతీయ స్థాయి పరీక్ష. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కోసం ఎగ్జామ్ రాస్తారు.

UGC NET 2026 | న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ (UGC NET 2026) పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనుకునే వారికి లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం అర్హత సాధించాలనుకునే అభ్యర్థులకు ఈ ఎగ్జామ్‌ చాలా ముఖ్యమైనది. UGC NET 2026 అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఒక ముఖ్యమైన జాతీయ స్థాయి పరీక్ష. మీరు ఈ పరీక్షకు హాజరు కావాలనుకుంటే, ముందుగా యూజీసీ నెట్ దరఖాస్తు చేసుకోవాలి. UGC NET జూన్ 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అందుకోసం ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

UGC NET 2026 ముఖ్యమైన తేదీలివే

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే UGC NET జూన్ 2026 ఎగ్జామ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 29న ప్రారంభమైంది. అభ్యర్థులు మే 20, 2026 వరకు అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే, వాటిని ఎడిట్ చేయడానికి మే 22 నుండి మే 24, 2026 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత పరీక్షకు ముందు జూన్ 10 నాటికి అభ్యర్థులకు వారి ఎగ్జామ్ సెంటర్ ఉన్న నగరాల సమాచారం అందుతుంది. తరువాత జూన్ 15 నాటికి అడ్మిట్ కార్డ్‌లు జారీ అవుతాయి. ఇంటర్ పూర్తి చేసిన వారికి ఈ కెరీర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

UGC NET 2026 పరీక్షా విధానం (Pattern)

UGC NET జూన్ 2026 పరీక్షా విధానం చాలా సులభంగా అర్థం చేసుకోండి. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer-Based Test) మోడ్‌లో నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండింటిలోనూ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు (MCQs) అడుగుతారు. ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానం ఎంచుకోవాలి. ఈ రెండు పేపర్ల ఎగ్జామ్స్ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతాయి. అంటే మొత్తం పరీక్షను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 3 గంటల సమయం కేటాయిస్తారు. 

UGC NET జూన్ 2026 కోసం రిజిస్ట్రేషన్ ఫీజు

UGC NET జూన్ 2026 కోసం దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు తమ categoryకి అనుగుణంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఫీజు 1150 రూపాయలు కాగా, OBC- NCL, EWS అభ్యర్థులు 600 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ జెండర్ అభ్యర్థులకు 325 రూపాయల దరఖాస్తు ఫీజు కట్టాలి. అభ్యర్థులు ఈ ఫీజును కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.

UGC NET జూన్ 2026 ఎగ్జామ్ ఇలా దరఖాస్తు చేయాలి

UGC NET జూన్ 2026 ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసేందుకు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in కి వెళ్లండి.

ఆ తర్వాత UGC NET June 2026 Registration లింక్‌పై క్లిక్ చేయాలి.

తరువాత కొత్త స్క్రీన్‌పై మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి.

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్‌ ఫిల్ చేయాలి. 

దీనితో పాటు అడిగిన సమాచారాన్ని ఖచ్చితంగా ఎంటర్ చేయండి.

అప్లికేషన్ ఫీజును చెల్లించి అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయండి.

చివరగా మీ అప్లికేషన్ ఫారమ్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫ్యూచర్ అవసరాల కోసం ఫారమ్ ప్రింటౌట్ తప్పకుండా తీసుకోండి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget