UGC NET 2025 Results: యూజీసీ నెట్ 2025 ఎగ్జామ్ రిజల్ట్స్ చెక్ చేసుకోండి, మీ స్కోర్‌కార్డ్‌ను ఇలా పొందవచ్చు
UGC NET Result 2025 | యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.

UGC Net 2025 Result Out | జూన్ నెలలో నిర్వహించిన UGC NET 2025 పరీక్షకు హాజరైన విద్యార్థులకు బిగ్ అప్ డేట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూలై 21, 2025న UGC NET జూన్ 2025 ఫలితాలను విడుదల చేసింది. యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in ను సందర్శించి వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. యూజీసీ నెట్ 2025 ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఫలితాలు చెక్ చేసుకునేందుకు అభ్యర్థులు వారి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ వివరాలతో అభ్యర్థులు యూజీసీ నెట్ జూన్ 2025 ఫలితాలు పొందవచ్చు. రిజల్ట్స్ ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలని అభ్యర్తులకు సూచించారు. యూజీసీ నెట్ జూన్ ఎగ్జామ్ పూర్తి వివరాలు
యూజీసీ నెట్ 2025 ఫలితాలను ఎలా చెక్ చేయాలి
- మీరు UGC NET జూన్ 2025 ఫలితాలను చెక్ చేయాలంటే కింద తెలిపినట్లు చేయాలి.
- ముందుగా, మీ మొబైల్ లేదా కంప్యూటర్, ల్యాప్‌టాప్ లలో ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో "UGC NET జూన్ 2025 రిజల్ట్స్ " అనే లింక్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు, మీ అప్లికేషన్ నంబర్, డేటాఫ్ బర్త్ వివరాలు నమోదు చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇప్పుడు, స్క్రీన్ మీద మీ యూజీసీ నెట్ జూన్ 2025 రిజల్ట్ కనిపిస్తుంది.
- మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ కూడా తీసుకోవడం బెటర్
పరీక్ష ఎప్పుడు జరిగింది
దేశ వ్యాప్తంగా పలు నగరాలలో UGC NET జూన్ పరీక్ష జూన్ 25 నుంచి జూన్ 29, 2025 వరకు నిర్వహించారు. జూలై 5, 2025న ఎగ్జామ్ ఆన్సర కీ విడుదల చేశారు. జూలై 6 నుండి జూలై 8, 2025 వరకు అభ్యంతరాలు స్వీకరించారు.
UGC NET అంటే ఏమిటి?
UGC NET అనేది జాతీయ స్థాయి పరీక్ష, ఇది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేశంలో పలు ప్రముఖ కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అర్హత సాధిస్తారు. ఈ నెట్ ఎగ్జామ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం అవసరం.
UGC NET జూన్ 2025 ఫలితాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
- అభ్యర్థులు ముందుగా ugcnet.nta.ac.in వెబ్‌సైట్ సందర్శించండి
- హోమ్‌పేజీలోని “Candidate Activity”” విభాగానికి వెళ్లండి.
- అక్కడ “UGC NET జూన్ 2025: స్కోర్‌కార్డ్ ”పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసిన అనంతరం సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
- రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, అది డౌన్‌లోడ్ చేసి కౌన్సెలింగ్ సహా ఇతర అవసరాల కోసం సేవ్ చేయండి.






















