అన్వేషించండి

NEET UG 2025 Counseling: నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రారంభం- రిజిస్ట్రేషన్ ప్రాసెస్, కావాల్సిన డాక్యుమెంట్ల పూర్తి వివరాలు

NEET UG 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జులై 21న ప్రారంభమైంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించింది.

NEET UG 2025 Counseling Registration Process | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది వైద్య విద్యార్థులు వేచి చూసిన సమయం రానే వచ్చింది. NEET UG 2025 ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుభవార్త. సోమవారం (జులై 21న) నాడు NEET UG కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) జూలై 21న కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. మీరు నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణులై, MBBS, BDS లేదా B.Sc నర్సింగ్‌ కోర్సులలో ప్రవేశం పొందాలనుకుంటే, మీరు MCC అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నీట్ యూజీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి అందుకు అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. 

NEET UG 2025 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు

1. రిజిస్ట్రేషన్ ప్రారంభం - మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఫేజ్ 1 కౌన్సెలింగ్ కోసం జూలై 21న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది.

2. రిజిస్ట్రేషన్ చివరి తేదీ - నీట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు జూలై 28వ తేదీ వరకు mcc.nic.inలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

3. కాలేజీల ఎంపిక ప్రారంభం - అభ్యర్థులు జూలై 22 నుంచి తమకు నచ్చిన మెడికల్/డెంటల్ కాలేజీలు, కోర్సులను ఆన్‌లైన్ ద్వారా ఆప్షన్‌లు సెలక్ట్ చేసుకోవచ్చు 

4. ఛాయిస్‌లను లాక్ చేసే తేదీ - జూలై 28 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:55 గంటల వరకు ఛాయిస్‌లను లాక్ చేయవచ్చు 

5. సీట్ల కేటాయింపు ప్రక్రియ - మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) జూలై 29,  30 తేదీలలో అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్‌ల ఆధారంగా సీట్లను కేటాయించనుంది 

6. సీట్ల కేటాయింపు రిజల్ట్ - జూలై 31న ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ఫలితాలను mcc.nic.inలో విడుదల చేయనున్నారు. 

7. కాలేజీలో రిపోర్టింగ్ - సీట్లు వచ్చిన విద్యార్థులు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 6, 2025 వరకు కాలేజీలలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలి.

ఎవరి కోసం నీట్ యూజీ కౌన్సెలింగ్
NEET UG 2025లో అర్హత సాధించిన వారు దేశంలోని ప్రభుత్వ లేదా కేంద్ర వైద్య కళాశాలల్లో MBBS, BDS కోర్సులు, B.Sc నర్సింగ్ కోర్సులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ లో పాల్గొంటారు. ఇందులో 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) ప్రభుత్వ మెడికల్ సీట్లు, AIIMS, BHU, AMU, JIPMER, ESIC, JMI వంటి సంస్థల 100 శాతం సీట్లు, అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల సీట్లు ఉన్నాయి.

మొత్తం ఎన్ని రౌండ్లు ఉంటాయి?
ఈసారి NEET UG కౌన్సెలింగ్ 4 రౌండ్లలో జరుగుతుంది. ఇందులో రౌండ్ 1 మొదటి అవకాశం కాగా, ఇందులో ఎక్కువ ఛాయిస్‌లు అందుబాటులో ఉంటాయి. మొదటి రౌండ్‌లో పాల్గొనని లేదా అప్‌గ్రేడ్ కోరుకునే విద్యార్థులు ఈ ఫేజ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. రౌండ్ 3 అంటే మాప్-అప్ రౌండ్, ఇందులో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. చివరిగా స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. ఈ రౌండ్‌లో ఏ రౌండ్‌లోనూ సీటు రాని అభ్యర్థులకు మిగిలిన సీట్లు కేటాయిస్తారు. ప్రతి రౌండ్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు, కాలేజీ, కోర్సుల ఎంపిక, ఛాయిస్‌లను లాక్ చేయడం, సీట్ల కేటాయింపు, కాలేజీలో రిపోర్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.

అవసరమైన డాక్యుమెంట్లు
కౌన్సెలింగ్ సమయంలో, కాలేజీలో రిపోర్టింగ్ సమయంలో అభ్యర్థులు ఈ డాక్యుమెంట్లను చూపించాలి, అవసరం అయితే వాటిని అప్‌లోడ్ చేయాలి.

  • నీట్ యూజీ 2025 (NEET UG 2025) అడ్మిట్ కార్డ్
  • విద్యార్థి నీట్ స్కోర్ కార్డ్
  • 10వ తరగతి, 12వ తరగతి మార్క్‌షీట్లు, సంబంధిత సర్టిఫికెట్‌లు
  • బర్త్ సర్టిఫికెట్
  • పాస్‌పోర్ట్ సైజులో 8 ఫోటోలు (NEET ఫారమ్‌లో ఉపయోగించినవే)
  • ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్
  • తాత్కాలికంగా మీకు సీటు కేటాయింపు ఉన్న లెటర్
  • కుల ధృవీకరణ పత్రం (Caste Centificate)
  • వైద్య ఆరోగ్య ధృవీకరణ పత్రం

రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?

1. మొదట moc.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లండి

2. UG మెడికల్ కౌన్సెలింగ్ సెక్షన్ ఓపెన్ చేయాలి.

3. అందులో New Registration బటన్‌పై క్లిక్ చేయండి.

4. మీ NEET UG 2025 రోల్ నంబర్, అప్లికేషన్ నంబర్, మొబైల్ నంబర్ లాంటి ముఖ్యమైన వివరాలను నమోదు చేయండి

5. తరువాత రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

6. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, కాలేజీలు మరియు కోర్సులను ఎంచుకోండి.

7. నిర్ణీత తేదీలలో ఛాయిస్‌లను లాక్ చేసి సబ్మిట్ చేయండి.

8. రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ / EWS (AIQ) కోసం రూ.1000, తిరిగి చెల్లించే సెక్యూరిటీ ఫీజు రూ.10,000. అలాగే SC, ST, OBC, PwD రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలు..  తిరిగి చెల్లించే సెక్యూరిటీ ఫీజు రూ.5000. డీమ్డ్ యూనివర్సిటీల కోసం రిజిస్ట్రేషన్ ఫీజు రూ.5000. తిరిగి చెల్లించే సెక్యూరిటీ ఫీజు రూ.2,00,000 ఉంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

iBOMMA Piracy Movies : షాకింగ్... కొత్తగా ఆ సైట్‌లో iBOMMA పైరసీ మూవీస్! - నిందితుడు రవి అలా ప్లాన్ చేశాడా?
షాకింగ్... కొత్తగా ఆ సైట్‌లో iBOMMA పైరసీ మూవీస్! - నిందితుడు రవి అలా ప్లాన్ చేశాడా?
Earthquake Today: పాకిస్తాన్ తర్వాత భారత్‌లో భూప్రకంపనలు! కోల్‌కతాలో జనం పరుగులు
పాకిస్తాన్ తర్వాత భారత్‌లో భూప్రకంపనలు! కోల్‌కతాలో జనం పరుగులు
Annapurna Studios : అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ - GHMC నోటీసులు... అసలు రీజన్ ఏంటంటే?
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ - GHMC నోటీసులు... అసలు రీజన్ ఏంటంటే?
Vizag Google Data Center: గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చకచచకా ఏర్పాట్లు! భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో శనివారం నుంచి నగదు జమ
గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చకచచకా ఏర్పాట్లు! భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో శనివారం నుంచి నగదు జమ
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test | రేపటి నుంచి రెండో టెస్ట్ మ్యాచ్
India vs South Africa ODI | రోహిత్, కోహ్లీ రీఎంట్రీ !
World Boxing Cup Finals 2025 | 20 పతకాలు సాధించిన ఇండియన్‌ ప్లేయర్స్‌
IPL Auction 2026 | ఐపీఎల్ 2026 మినీ వేలం
Car Driver Attack RTC Driver | కారుకు దారివ్వలేదని బస్ డ్రైవర్‌పై దాడి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
iBOMMA Piracy Movies : షాకింగ్... కొత్తగా ఆ సైట్‌లో iBOMMA పైరసీ మూవీస్! - నిందితుడు రవి అలా ప్లాన్ చేశాడా?
షాకింగ్... కొత్తగా ఆ సైట్‌లో iBOMMA పైరసీ మూవీస్! - నిందితుడు రవి అలా ప్లాన్ చేశాడా?
Earthquake Today: పాకిస్తాన్ తర్వాత భారత్‌లో భూప్రకంపనలు! కోల్‌కతాలో జనం పరుగులు
పాకిస్తాన్ తర్వాత భారత్‌లో భూప్రకంపనలు! కోల్‌కతాలో జనం పరుగులు
Annapurna Studios : అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ - GHMC నోటీసులు... అసలు రీజన్ ఏంటంటే?
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ - GHMC నోటీసులు... అసలు రీజన్ ఏంటంటే?
Vizag Google Data Center: గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చకచచకా ఏర్పాట్లు! భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో శనివారం నుంచి నగదు జమ
గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చకచచకా ఏర్పాట్లు! భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో శనివారం నుంచి నగదు జమ
Raju Weds Rambai Review - 'రాజు వెడ్స్ రాంబాయి' రివ్యూ: అంత బోల్డ్ & కల్ట్ కాన్సెప్ట్ ఏముంది? సినిమా ఎలా ఉంది?
'రాజు వెడ్స్ రాంబాయి' రివ్యూ: అంత బోల్డ్ & కల్ట్ కాన్సెప్ట్ ఏముంది? సినిమా ఎలా ఉంది?
Trains Cancelled :రైలు టికెట్ బుక్ చేసుకున్నారా? రైల్వేశాఖ రద్దు చేసిన ట్రైన్స్‌ జబితా ముందు చూసుకోండి!
రైలు టికెట్ బుక్ చేసుకున్నారా? రైల్వేశాఖ రద్దు చేసిన ట్రైన్స్‌ జబితా ముందు చూసుకోండి!
Chandrababu: ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
Embed widget