NEET UG 2025: తెలంగాణ మెరిట్ జాబితా విడుదల! మీ పేరు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి!
Telangana NEET UG 2025 Merit List : తెలంగాణ నీట్ యుజి 2025 మెరిట్ జాబితాను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విడుదల చేసింది.

Telangana NEET UG 2025 Merit List : NEET UG 2025కు సంబంధించిన తెలంగాణలో విద్యార్థులు సాధించిన మెరిట్ జాబితా విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తెలంగాణ నీట్ యుజి 2025 రాష్ట్ర మెరిట్ జాబితా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అభ్యర్థులు knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్‌లో నీట్ రాసిన అభ్యర్థుల రాష్ట్ర స్థాయి ర్యాంకులను ఉంచారు. MBBS, BDS కౌన్సెలింగ్ అర్హత ఇతర వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్కు చేసుకోవాలి. వారి పేర్లు, ర్యాంకుల వివరాలు ఉంచారు. ఇప్పుడు విడుదల చేసిన మెరిట్ జాబితా NEET UG స్కోర్ ఆధారంగా తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది. అందుకే వీటి గురించి తెలుసుకోవడం అభ్యర్థులకు చాలా అవసరం.
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) అధికారిక వెబ్‌సైట్ knruhs.telangana.gov.inలో ఈ మెరిట్ జాబితాను పీడీఎఫ్ రూపంలో ఉంచింది. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ పీడీఎఫ్‌ను డౌన్ లోడ్ చేసుకొని తర్వాత మీరు పేరు చెక్ చేయాలి.
NEET UG 2025కి తెలంగాణ నుంచి హాజరైన అభ్యర్థులకు వచ్చిన మార్కులు ఆధారంగా ఈ మెరిట్ జాబితా తయారు చేశారు. ఇప్పుడు కౌన్సెలింగ్ కూడా దీని ప్రకారమే జరగనుంది. తెలంగాణ వైద్య, దంత కళాశాలల్లో చేరాలనుకునే వారు కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
తెలంగాణ నీట్ UG 2025 మెరిట్ జాబితా పీడీఎఫ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
- స్టెప్1: అధికారిక వెబ్‌సైట్‌ను knruhs.telangana.gov.in వెళ్లాలి.
- స్టెప్ 2: హోమ్‌పేజీలోని ‘నోటిఫికేషన్‌లు’ విభాగానికి వెళ్లాలి.
- స్టెప్ 3: “తెలంగాణ నీట్ ర్యాంక్ జాబితా 2025” అనే లింక్‌పై క్లిక్ చేయండి
- స్టెప్ 4: PDF ఓపెన్ అవుతుంది. డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసి పెట్టుకోవాలి. కౌన్సెలింగ్ కోసం అవసరం ఉంటుంది.
మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న వారే KNRUHS నిర్వహించే రాష్ట్ర కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు అవుతారు.
పీడీఎప్‌లో ఏమున్నాయి?
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విడుదల చేసిన మెరిట్ జాబితాలో మొత్తం 43వేల400 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. తెలంగాణ నుంచి పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణత సాధించిన వారే వీళ్లంతా. కటాఫ్‌కు సంబంధించిన వివరాలను కూడా ఇందులో యూనివర్శిటీ సూచించింది. ఓపెన్ కేటగిరి, EWS అభ్యర్థుల కటాఫ్ స్కోర్ 686 - 144 మధ్య ఉంటుంది. ఓబీసీ వాళ్లకు 143 నుంచి 113 వరకు ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 143 -113 మధ్య ఉంటుంది.
వీటితోపాటు పీడీఎఫ్‌లో NEET రోల్ నంబర్, NEET ర్యాంక్, అభ్యర్థి పేరు, కేటగిరీ, NEET స్కోర్ ఉన్నాయి. తర్వాత దశ కౌన్సెలింగ్ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీని కోసం అభ్యర్థులు KNRUHS వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండాలి.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైన తర్వాత సర్టిఫికెట్లను పరిశీలించి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరించి తుది మెరిట్ జాబితాను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.





















