TS Edcet Results 2025: తెలంగాణ ఎడ్‌సెట్ 2025 ఫలితాలు విడుదల- ఈ లింక్ ద్వారా ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్
TS Edcet Results 2025: తెలంగాణలో బీఈడీ చేయాలనే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ మధ్య జరిగిన ఫలితాలను కాకతీయ యూనివర్శిటీ విడుదల చేసింది.

తెలంగాణలో ఎడ్‌సెట్ ఫలితాలు 2025 విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇవాళ (జూన్ 21, 2025) వరంగల్‌లోని కాకాతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. ఫలితాలను TGCHE అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. రెండేళ్ల ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర స్థాయిలో కామన్ ఎంట్రన్స్ టెస్టు పెట్టింది. అదే ఎడ్‌సెట్. ఆ ఫలితాలను ఇప్పుడు వెబ్‌సైట్‌లో పెట్టింది.
ఎడ్‌సెట్ 2025 ఫలితాలను ఎలా చెక్ చేయాలి
ఎడ్‌సెట్ ఫలితాలు చూడాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
అధికారిక విద్యాశాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్తే అక్కడ డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్స్ లేదా రిజల్ట్స్ అని ఉంటుంది. డైరెక్ట్ లింక్ ఇదే
ఈ రెండు కూడా మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి.
ముందుగా ఎడ్‌సెట్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయాలి.
వేరే విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి.
సబ్‌మిట్ బటన్ క్లిక్ చేస్తే రిజల్ట్స్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఫలితాలం చూసిన తర్వాత దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
ర్యాంకు కార్డును కూడా ఇలానే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో 2025లో జరిగిన టీఎస్ ఎడ్‌సెట్ (TS EDCET) పరీక్షకు దాదాపు 38,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష జూన్ 1, 2025న కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగింది. దరఖాస్తు చేసుకున్న ఈ 38,754 మందిలో 32,106 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ హాజరైన వారిలో 30,944 మంది కౌన్సలింగ్‌కు అర్హత సాధించారు. అంటే దాదాపు 96.38 శాతం మంది విజేతలుగా నిలిచారు.
టీఎస్ ఎడ్‌సెట్ 2025 పరీక్ష జూన్ 1, 2025న రెండు సెషన్‌లలో (10:00 AM నుంచి 12:00 PM - 2:00 PM నుంచి 4:00 PM) జరిగింది. కౌన్సెలింగ్ ప్రక్రియ జులైలో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో వెబ్ ఆప్షన్‌లు, సీట్ అలాట్‌మెంట్, ధ్రువీకరణ దశలు ఉంటాయి. అర్హులు ర్యాంకు కార్డ్‌ను జూన్ 21, 2025 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఇది కౌన్సెలింగ్ కోసం ముఖ్యమైంది.





















