అన్వేషించండి

Career Options After 12th : ఇంటర్ తర్వాత అద్భుతమైన కెరీర్ ఆప్షన్స్.. ఎక్కువ జీతంతో పాటు లైఫ్ సెట్ చేసుకోగలిగే ఎంపికలు ఇవే

Courses after Inter : ఇంటర్ తర్వాత కెరీర్ మనం ఎలా మలచుకుంటామో.. అదే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. అందుకే 12 తర్వాత ఎంచుకోగలిగే 5 అద్భుతమైన కెరీర్ ఆప్షన్స్ ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇంటర్ తర్వాత కెరీర్ ఎంచుకోవడం భవిష్యత్తుకు కీలకం.
  • డేటా సైన్స్, ఏఐ రంగాల్లో మంచి అవకాశాలున్నాయి.
  • న్యాయ రంగం, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆశాజనకం.
  • దేశ సేవకు NDA, క్రియేటివిటీకి డిజిటల్ మార్కెటింగ్.

Top Career Options After 12th : ఇంటర్ పరీక్షలు అయిపోగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొనే అతిపెద్ద ప్రశ్న పిల్లల్ని తర్వాత ఏమి చేయాలి? ఈరోజుల్లో మంచి కెరీర్ కావాలనుకుంటే ఎలాంటి ఆప్షన్స్ ఎంచుకోవాలో అని ఆలోచిస్తారు. కానీ ఒకప్పుడు చాలామంది డాక్టర్లు లేదా ఇంజనీర్లు అవ్వాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి ప్రపంచంలో తెలివైన కెరీర్ ఆప్షన్ లేకుంటే.. ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. భవిష్యత్తులో సక్సెస్ అయ్యేందుకు ఇంటర్ తర్వాత కెరీర్ ఆప్షన్ ఎంచుకోవడం కీలకం. వాటివల్ల మీరు మంచి ఆదాయం, సమాజంలో గౌరవం, సురక్షితమైన భవిష్యత్తును పొందగలుగుతారు. అలాంటి అద్భుతమైన కెరీర్ ఎంపికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంచుకునే కెరీర్ ఆప్షన్ ముఖ్యం

ఈ రోజుల్లో కష్టపడితే సరిపోదు.. సరైన వృత్తిని ఎంచుకోవడం కూడా ముఖ్యం. చాలామంది ఏమి చేస్తారంటే.. ఎక్కువమంది దేనిలో జాయిన్ అవుతున్నారో చూసి.. వారిని అనుసరించి.. ఉద్యోగ హామీ లేని కోర్సులను ఎంచుకుంటారు. అలాకాకుండా స్టూడెంట్స్ తమ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా ఉండే వృత్తిని ఎంచుకోవడం చాలా అవసరం. తద్వారా మీరు విజయవంతమైన, సమతుల్యమైన జీవితాన్ని పొందగలుగుతారు.

డేటా సైన్స్, ఏఐ

సోషల్ మీడియా కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ ఆప్షన్స్​లో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. డేటాను అర్థం చేసుకోగల, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడగల నిపుణులను ప్రధాన కంపెనీలు నియమించుకుంటున్నాయి. కాబట్టి మ్యాథ్స్, టెక్నాలజీపై ఆసక్తి ఉన్న విద్యార్థులు దీనిని ఎంచుకోవచ్చు. ప్రారంభ జీతం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

న్యాయ రంగం..

ఈరోజుల్లో లాయర్ వృత్తి కూడా ఆశాజనకంగా మారింది. న్యాయవాదుల పాత్ర ఇకపై కోర్టు గదికే మాత్రమే పరిమితం కాకుండా కార్పోరేట్​ వైపు అడుగులు వేస్తుంది. దీనికోసం మీరు బి.ఏ ఎల్.ఎల్.బి లేదా బి.బి.ఏ ఎల్.ఎల్.బి.. వంటి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును చేయవచ్చు. విద్యార్థులు పెద్ద కంపెనీలలో న్యాయ సలహాదారులుగా మారవచ్చు. ఈ రంగం మంచి జీతభత్యాలు అందించడమే కాకుండా.. మీకు మంచి క్రెడిబులిటీ ఇస్తుంది.

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్

నిర్వహణ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు.. ఐపీఎం (ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్) ఎంచుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేసిన వెంటనే తమ నిర్వహణ అధ్యయనాలను ప్రారంభించవచ్చు. తద్వారా ప్రత్యేక గ్రాడ్యుయేట్ డిగ్రీ అవసరం ఉండదు. ఈ కోర్సు సమయాన్ని ఆదా చేయడంతో పాటు.. త్వరగా వృత్తి మార్గాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది.

ఎన్​డీఏ 

దేశ సేవ చేయాలనే తపన ఉన్న విద్యార్థులు ఎన్‌డిఎని ఎంచుకోవచ్చు. ఇదొక ప్రతిష్టాత్మకమైన ఎంపిక. 12వ తరగతి తర్వాత ఎన్‌డిఎ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా విద్యార్థులు భారత సైన్యంలో అధికారులుగా చేరవచ్చు. ఈ రంగంలో లభించే గౌరవం, సౌకర్యాలు, క్రమశిక్షణ దీనిని అన్నింటికంటే ప్రత్యేకంగా చేస్తాయి. దేశానికి సేవ చేయాలనుకునే వారి కోసమే ఈ వృత్తి ఉంది.

డిజిటల్ మార్కెటింగ్..

నేటి డిజిటల్ యుగంలో డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు. ప్రతి కంపెనీకి, సెలబ్రెటీకి తమ సోషల్​ మీడియా ఫాలోవర్స్ పెంచుకోవడానికి నిపుణులు అవసరం. ఈ రంగం క్రియేటివిటీ ఉన్న విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ప్రపంచ స్థాయిలో పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget