అన్వేషించండి

Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం

Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల పెంపు ఒక్కటే మార్గం కాదని, పన్నులు పెంచితే ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల పెంపు ఒక్కటే మార్గం కాదని, పన్నులు పెంచితే ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలపై ఎలాంటి అదనపు పన్ను భారం వేయకుండానే, కేవలం వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వ్యవస్థాగత సంస్కరణలే కీలకం 
ఇంటి పన్ను, జీఎస్టీ, మైనింగ్, ఎక్సైజ్ వంటి రంగాల్లో పన్నులు ఎగ్గొట్టే వారిని గుర్తించి, వారిని పన్నుల పరిధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇందుకోసం సీనియర్ అధికారి అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ వంటి అధికారులతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్కరణల ఫలితంగా గడిచిన నాలుగు నెలల్లో ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ నుండి ప్రతి నెల 500 కోట్ల చొప్పున పెరుగుతూ, ఏప్రిల్ నెలలో ఏకంగా 1000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. ఈ నెల జీఎస్టీ ఆదాయంలో 35 శాతం వృద్ధి నమోదవ్వడం విశేషమని ఆయన గుర్తుచేశారు

లీకేజీలు అరికట్టడం ద్వారా పెరిగిన ఆదాయం 
చిన్న చిన్న లీకేజీలను అరికట్టడం, వ్యవస్థలో చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా గత నాలుగు నెలల్లో దాదాపు 2000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా 600 కోట్ల వద్దే స్తంభించిపోయిన మైనింగ్ ఆదాయం, అధికారుల కృషి వల్ల ప్రస్తుతం 1100 కోట్లకు చేరిందని వివరించారు. ఎలాంటి అదనపు పన్నులు విధించకుండానే కేవలం అధికారుల పనితీరును మెరుగుపరచడం ద్వారా ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. 

ఏటా రూ. 36 వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యం 
అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే నెలకు 3000 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని, తద్వారా ఏడాదికి 36,000 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ఖజానాకు సమకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డి అంచనా వేశారు. ఈ అదనపు ఆదాయం ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలను పరిష్కరించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏడాది తిరిగేలోపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మున్సిపల్ రిఫార్మ్స్ వల్ల కూడా అన్ని మున్సిపాలిటీల్లో ఆదాయం పెరిగిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget