అన్వేషించండి

Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?

తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనుంది.

హైదరాబాద్: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మంత్రివర్గం నుంచి కొందరిని తొలగించే అవకాశం ఉండగా.. కొత్త వారికి సైతం కేబినెట్‌లో అవకాశం లభించనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా కేరళలో యూడీఎఫ్ (UDF) కూటమికి మెజార్టీ వస్తే అక్కడ సీఎం పదవి తేల్చిన తరువాత కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణపై ఫోకస్ చేయనుందని తెలుస్తోంది. 

ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో మరో ఇద్దరు నేతల్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు వీలుంది. ఇందులో ఒక స్థానాన్ని ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించే ఛాన్స్ ఉండటంతో రేసులో బాలూనాయక్, రామచంద్రునాయక్ వంటి నాయకులు ఉన్నారు. మంత్రి పదవి తమనే వరిస్తుందని దీమాగా ఉన్నారు. అయితే రామచంద్రునాయక్‌ను గత ఏడాది డిప్యూటీ స్పీకర్ పోస్టుకు ఖరారు చేసినప్పటికీ శాసనసభలో ఇంకా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇక మరో మంత్రి పదవి బెర్త్ కోసం పలువురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకే అధిష్ఠానం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సీనియర్ నేతలు, పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించే వారి పేర్లను సైతం కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించనుంది. కొందరు మంత్రుల వ్యవహారశైలిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నందున పార్టీకి సైతం డ్యామేజ్ జరగకూడదని వారిని మార్చాలని రేవంత్ సూచించే అవకాశాలున్నాయి.

నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి.. ?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ క్యాబినెట్‌లో ప్రాతినిథ్యం లేదు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, సీతక్క మంత్రులుగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి ప్రస్తుతం క్యాబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయనను మంత్రిగా తీసుకుంటారా లేక ఇదే జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు మంత్రి పదవి దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రేవంత్ మాత్రం మహేష్ గౌడ్‌ను పార్టీ పరంగానే ప్రయోజనం కోసం పీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి విజయం సాధించాలంటే మహేష్ గౌడ్ లాంటి నేత పార్టీ సారథిగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా?
మంత్రి పదవి కోసం చాలా మంది రేసులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వినిపించే పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే తనకు ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని నమ్ముతున్నారు. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉండటం మైనస్ అవుతోంది. కుటుంబం నుంచి ఒకే మంత్రి పదవి ఇవ్వాలని, రెండు పదవులు ఇవ్వకూడదని కాంగ్రెస్ హైకమాండ్ అభ్యంతరం తెలుపుతోంది. రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడి ఒప్పించడం అంత ఈజీ కాదని వినిపిస్తోంది. వీరితో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, మదన్‌మోహన్‌ రావు, రామ్మోహన్‌ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావుకు క్యాబినెట్ హోదాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. 

శాఖల ప్రక్షాళన సైతం
మంత్రివర్గ విస్తరణతో పాటు కొన్ని కీలక శాఖల్లో మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి అదనపు బారంగా మారిన కీలకమైన హోం శాఖ బాధ్యతను ఒక సీనియర్ మంత్రికి అప్పగిస్తారని పార్టీలోనూ వినిపిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ ఉన్నప్పటికీ.. టెన్త్, ఇంటర్ ఫలితాలు ప్రభుత్వ సలహాదారు కేశవరావు విడుదల చేశారని తెలిసిందే. కేరళ ఎన్నికల ఫలితాల తర్వాతే తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కనుక కేబినెట్ విస్తరణకు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
El Nino Effect: వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget