News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Engineering Colleges: ఇంజినీరింగ్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, 73 కాలేజీలకు 'నో' పర్మిషన్

ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 7న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 7న ప్రారంభమైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 12 గంటలకే ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభించారు. ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు ఈఏపీసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్ ఆప్షన్ల నమోదుకోసం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 13న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక వీరికి ఆగస్టు 17న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 
వెబ్‌ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి..

వెబ్‌ ఆప్షన్ల నమోదు షెడ్యూలు ఇలా..

➥ ఆప్షన్ల నమోదు: 07.08.2023 నుంచి 12.08.2023 వరకు.

➥ ఆప్షన్లలో మార్పులు: 13.08.2023.

➥ సీట్ల కేటాయింపు: 17.08.2023.

➥ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌(ఆన్‌లైన్), సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్‌: 18.08.2023 నుంచి 21.08.2023 వరకు.

➥ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం: 23.08.2023 నుంచి.

73 కళాశాలలకు ప్రభుత్వం అనుమతులు నిలిపివేత..
ఏపీ ప్రభుత్వం 73 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు నిలిపివేసింది. కౌన్సెలింగ్‌ జాబితా నుంచి కూడా ఆ కళాశాలలను తొలగించింది. ఏఐసీటీఈ 252 కళాశాలలకు అనుమతులిచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం 179 కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుమతించింది. దీనికి విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపు, ఇతరత్ర సేవల కింద చెల్లించాల్సిన ఫీజుల బకాయిలను సదరు కళాశాలలు చెల్లించలేదని కారణంగా పేర్కొంది. వర్సిటీలు ఎలాంటి సేవలు అందించకుండానే ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ దాదాపు 50 కళాశాలలు హైకోర్టును గతంలోనే ఆశ్రయించాయి. వీటిలో 11 కళాశాలలను కౌన్సెలింగ్‌లో పెట్టాలని ఇప్పటికే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. బోధనారుసుముల చెల్లింపు భారాన్ని తగ్గించుకునేందుకే అనుమతులు నిలిపివేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

92 కళాశాలలకు రూ.43 వేలే ఫీజులు..
ఏపీలోని ప్రైవేట్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి కనీస ఫీజు రూ.43 వేలు, గరిష్ఠం రూ.77 వేలుగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 220 ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఫీజులు నిర్ణయించగా 92 కళాశాలల్లో కనిష్ఠ ఫీజు రూ.43 వేలుగా ఉంది. గత నాలుగేళ్లుగా కనీస ఫీజు రూ.35 వేలు ఉండగా హైకోర్టు ఆదేశాలతో రూ.8 వేలు పెరిగింది. అయితే ఫీజుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎక్కువ కళాశాలకు కనిష్ఠ ఫీజునే నిర్ణయించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు గతేడాది రూ.60 వేల పైగా ఫీజుండగా.. ఈ ఏడాది రూ.43 వేలకు కుదించడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. 

కన్వీనర్‌ సీట్లకు ఫీజుల నిర్ణయం..
ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో 35 శాతం ఉన్న కన్వీనర్‌ కోటా సీట్లకు ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఆర్‌ఎం, విట్‌, మోహన్‌బాబు యూనివర్సిటీల్లో రూ.70 వేలు, సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో రూ.50 వేలు, భారతీయ ఇంజినీరింగ్‌ సైన్స్‌, టెక్నాలజీ ఇన్నోవేషన్‌ యూనివర్సీటీలో రూ.40 వేలుగా నిర్ణయించింది. ఎంబీఏ (రెండేళ్లు)కు రూ.70 వేలు, బీఏ, బీకాం, బీఎస్సీ (మూడేళ్లు)లకు కనిష్ఠంగా రూ.30 వేలు, గరిష్ఠంగా రూ.70 వేలుతో పాటు బీబీఏ ఫీజును రూ.25 వేలుగా పేర్కొంది.

ALSO READ:

తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సులు, వివరాలు ఇలా!
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

కాళోజీ  హెల్త్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 07 Aug 2023 04:17 PM (IST) Tags: Engineering counselling AP EAPCET 2023 counselling Agriculture Counselling APEAPCET 2023 Counselling Schdule APEAPCET 2023 MPC Stream Counselling

ఇవి కూడా చూడండి

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

Telangana Group 1 :    గ్రూప్ 1 ప్రిలిమ్స్  రద్దు ఖాయం   - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి