అన్వేషించండి

Agricet: అగ్రిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, 99.5 శాతం ఉత్తీర్ణులు

ఏపీలో అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'అగ్రిసెట్‌-2023' ప్రవేశ పరీక్ష ఫలితాలు అక్టోబరు 6న విడుదలయ్యాయి. అక్టోబర్‌ 7 నుంచి విద్యార్థుల మార్కుల జాబితాను అందుబాటులో ఉంచనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అడ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబరు 1న నిర్వహించిన 'అగ్రిసెట్‌-2023' ప్రవేశ పరీక్ష ఫలితాలు అక్టోబరు 6న విడుదలయ్యాయి. వర్సిటీ పరిపాలన భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి శారద జయలక్ష్మీదేవి, అగ్రిసెట్‌ కన్వీనర్‌ సుధాకర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ, తెలంగాణల నుంచి మొత్తం 2006 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 1994 (99.5శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. అక్టోబర్‌ 7 నుంచి విద్యార్థుల మార్కుల జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. త్వరలోనే కౌన్సెలింగ్‌ తేదీలను వెల్లడించనున్నట్లు రిజిస్ట్రార్‌ రామారావు వెల్లడించారు.

అగ్రిసెట్-2203 టాపర్లు వీరే..

➥ అగ్రికల్చర్ కోర్సులో ఆర్‌.హేమంతకుమార్‌ 119, పి.రామప్రతాప్, వి.హరీష్‌ 118 మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 

➥ సేంద్రియ వ్యవసాయ కోర్సులో ఎరుకల యశస్విని 107, ఎం.లహరి 100, సి.కార్తికేయ 98 మార్కులతో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 

➥ విత్తన సాంకేతిక కోర్సులో తెలంగాణ విద్యార్థులు యు.బాలాజి, ఎల్‌.రాకేష్‌ 106, జి.లీలా మాళవిక 96 మార్కులు సాధించి మొదటి మూడు స్థానాలు సాధించారు. 

Website

ALSO READ:

CPGET: సీపీగెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇలా
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించి 'కామన్ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్)-2023' రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభమైంది. సీపీగెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు, మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందనివారు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజుగా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్‌ టైమ్ పీజీ కోర్సులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌)-పార్ట్‌ టైమ్ పీజీ కోర్సుల్లో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. సెప్టెంబరు 27తో ముగిసిన గడువును అక్టోబరు 9 వరకు పొడిగించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎంటెక్‌, ఎంబీఏ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. వీటిని ఉద్యోగులకు ప్రత్యేకించారు. అభ్యర్థులు హైదరాబాద్‌ పరిధిలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుతోపాటు ఒరిజినల్‌ సర్వీస్‌ సర్టిఫికెట్‌ అవసరమవుతాయి. ప్రవేశపరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లకు ఎలాంటి స్కాలర్‌షిప్‌ లభించదు. 
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget