అన్వేషించండి

CPGET: సీపీగెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇలా

సీపీగెట్-2023' రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభమైంది. సీపీగెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు, మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందనివారు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించి 'కామన్ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్)-2023' రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభమైంది. సీపీగెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు, మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందనివారు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజుగా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అక్టోబరు 12 వరకు రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 13న సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఏమైనా లోపాలు ఉంటే ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. అక్టోబరు 14 నుంచి 17 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పిస్తారు. ఇక వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 23న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబరు 26 నుంచి 31లోపు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్‌తోపాటు స్వయంగా కళాశాలలో ఒరిజినల్ టీసీ సమర్పించాల్సి ఉంటుంది. ఇతర ధ్రువపత్రాలైన ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ మెమోలు, కులం, ఈడబ్ల్యూఎస్, ఆదాయం తదితర వాటిని కేవలం పరిశీలనకు మాత్రమే చూపాలి. విద్యార్థుల నుంచి ఒరిజనల్ టీసీ మాత్రమే తీసుకోవాలని ప్రిన్సిపల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 

కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ: 06.10.2023 - 12.10.2023.

➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ వివరాలు: 13.10.2023.
(ఏమైనా లోపాలుంటే ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు)

➥ వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ: 14.10.2023 - 17.10.2023.

➥ వెబ్ ఆప్షన్ల సవరణ: 17.10.2023.

➥ సీట్ల కేటాయింపు: 23.10.2023.

➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 26.10.2023 - 31.10.2023.

Counselling Website

CPGET: సీపీగెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇలా

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ సెప్టెంబరు 29న పూర్తయిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సులకు సంబంధించి మొత్తం 30,176 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోగా.. 22,599 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో 16,496 మంది అమ్మాయిలే కావడం విశేషం. అంటే 73 శాతం సీట్లు అమ్మాయిలకే కేటాయించారు. ఇక అబ్బాయిల విషయానికొస్తే కేవలం 6,103 మాత్రమే సీట్లు పొందారు.  

సీపీగెట్-2023 పరీక్షలను జూన్‌ 30 నుంచి జూలై 10 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు 22,468 మంది పురుషులు, 45,954 మంది మహిళలు సహా మొత్తం 68,422 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఫలితాలు ఆగస్టు 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మొత్తం 93.42 శాతం మంది అర్హత సాధించారు. అందులో 19,435 మంది పురుషులు, 40,230 మంది మహిళలు సహా మొత్తం 59,665 మంది పరీక్షలు రాశారు. వారిలో 18,172 మంది పురుషులు, 37,567 మంది మహిళలు సహా మొత్తం 55,739 మంది క్వాలిఫై అయ్యారు.

ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతోపాటు హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.

డిగ్రీ ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు..

➥ రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు.

➥ డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.

➥ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టులు క్రియేట్‌ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్‌ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget