అన్వేషించండి

BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.

కోర్సుల వివరాలు..

1) డిగ్రీ కోర్సులు

- బీఏ

- బీకామ్

- బీఎస్సీ

- బీఎల్‌ఐఎస్సీ.

కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు)

2) పీజీ కోర్సులు: ఎంబీఏ, ఎంఏ(జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ), ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ), ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ.

3) డిప్లొమా కోర్సులు: సైకలాజికల్ కౌన్సెలింగ్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌‌మెంట్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్(హెచ్ఆర్‌ఎం), ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్,  ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఇన్ మాస్ మీడియా(తెలుగు), హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్.

4) సర్టిఫికేట్ కోర్సులు: ఫుడ్ అండ్ న్యూట్రీషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.

అర్హతలు: 

➥ డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ చదివినా అర్హులే. 

➥ పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎంకామ్ కోర్సుకు మాత్రం బీబీఏ, బీబీఎం, బీఏ(కామర్స్) ఉండాలి. సైన్స్ సబ్జెక్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

➥ డిప్లొమా కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి.

➥ సర్టిఫికేట్ కోర్సులకు పదోతరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Notification

Application Form for BA, BCom & BSc Courses

UG Courses Details

Application Form for PG(MA/M.Sc/M.Com)/ Diploma and Certificate  Programmes

PG, Other Courses Details

ALSO READ:

హెచ్‌సీయూ స్థాయిలో తెలంగాణ గిరిజన యూనివర్సిటీ, వచ్చే ఏడాది నుంచే ప్రవేశాలు!
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ములుగులో ఏర్పాటుకానున్న 'సమ్మక్క-సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం'లో వచ్చే విద్యాసంవత్సరం (2023-24) నుంచే తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అక్టోబరు 4న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.899 కోట్లను మంజూరు చేస్తూ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌,  2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 1 నుంచి అక్టోబరు 7 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్‌) లేదా పోస్ట్‌ బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణతతో పాటు అయిదేళ్ల పని అనుభవం ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Mahakumbh: ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
India vs Pakistan Champions Trophy 2025: పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Embed widget