By: ABP Desam | Updated at : 02 Oct 2023 09:45 PM (IST)
Edited By: omeprakash
KNRUHS - ఎంఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 1 నుంచి అక్టోబరు 7 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
1) ఎంఎస్సీ నర్సింగ్ కోర్సు
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్) లేదా పోస్ట్ బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు అయిదేళ్ల పని అనుభవం ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
2) ఎంపీటీ కోర్సు
అర్హత: కనీసం 55% మార్కులతో బీపీటీ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై, 30.09.2023లోపు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అర్హత, అనుభవం ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ఫీజు: అభ్యర్థులు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ఫీజు కింద రూ.5,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.4,000 చెల్లించాలి. అయితే ఏపీ, తెలంగాణకు చెందనివారు అదనంగా రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది.
సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..
➥ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tsparamed2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
➥ నిబంధనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrparamedadmission@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.10.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.10.2023.
ALSO READ:
నిమ్స్'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2023 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 7లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు నిర్ణీత నమూనాలో రూ.200 విలువచేసే నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్‌పై అండర్‌టేకింగ్ ఇవాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
AP Tenth: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్లోడ్ లింక్ ఇదే
GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే
CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!
AP Inter Fees: ‘ఇంటర్’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?
Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !
/body>