అన్వేషించండి

Tribal Unversity: హెచ్‌సీయూ స్థాయిలో తెలంగాణ గిరిజన యూనివర్సిటీ, వచ్చే ఏడాది నుంచే ప్రవేశాలు!

ములుగులో ఏర్పాటుకానున్న 'సమ్మక్క-సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం'లో వచ్చే విద్యాసంవత్సరం (2023-24) నుంచే తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ములుగులో ఏర్పాటుకానున్న 'సమ్మక్క-సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం'లో వచ్చే విద్యాసంవత్సరం (2023-24) నుంచే తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అక్టోబరు 4న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.899 కోట్లను మంజూరు చేస్తూ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

రానున్న ఐదేళ్లలో ఈ విశ్వవిద్యాలయానికి అవసరమైన భవనాలను నిర్మించి ఇతర మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలను కల్పించాలని, నిర్మాణ పనులను వెనువెంటనే చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ మంత్రిమండలి సమావేశానికి హాజరైన విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరినట్టు సమాచారం.

గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాలు పూర్తయ్యే దాకా వరంగల్‌ పట్టణంలో భవనాలను అద్దెకు తీసుకుని పాలనా వ్యవహారాలను నిర్వహించాలని కేంద్ర విద్యా శాఖ ప్రతిపాదించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వరంగల్‌లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో ఉన్న భవనాల్లో తరగతులు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదట ఐదారు కోర్సులతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఈ వర్సిటీకి వెంటనే ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ)ని నియమించడంతో పాటు అవసరమైన సిబ్బందిని విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.

ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చేర్చుకునే సంప్రదాయం ఉన్నందున వారికి ఉపయుక్తమయ్యే కోర్సులను గుర్తించి వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని వెంటనే పనులను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.  .

వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐటీ ఉన్నందున అక్కడ లేని కోర్సులను గిరిజన వర్సిటీలో మొదలుపెట్టాలని, ఇందుకు ఒక కమిటీని ఎంపిక చేసి తెలంగాణకు పంపించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే లోపు నిర్మాణ పనులు ఊపందుకునేలా చూడాలని, ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేలా ఆదేశాలు కూడా జారీ చేశానని ఆయన చెప్పినట్టు సమాచారం.

పరిశోధనలకు పెద్దపీఠ
తెలంగాణాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీలో పెద్ద ఎత్తున పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. గిరిజన అక్షరాస్యత పెంపు దిశగా చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలో లంబాడీలు, ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నందున.. మైదాన ప్రాంతంలో ఉన్న ఈ తెగలు బాగానే రాణిస్తున్నా.. నల్లమల అటవీ ప్రాంతంలో జనాలకు దూరంగా ఉంటూ అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న చెంచులు, సుగాలీలు, కొండ కాపులు; తదితర సామజిక వర్గాలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. వారిని అన్ని రంగాల్లో వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా పరిశోధనలు జరగాలని.. ఇందుకోసం విరివిగా నిధులను కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget