AP POLYCET సీట్ కేటాయింపు ఫలితాలు విడుదల: మీ సీటు వచ్చిందో లేదో తెలుసుకోండి!
AP POLYCET 2025: ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ ప్రవేశాలకు సంబంధించిన సీట్ల కేటాయింపు ఫలితాలు వచ్చేశాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు.

AP POLYCET Seat Allotment Result 2025: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) సీట్ల కేటాయింపు రిజల్ట్స్‌ను ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ విడుదల చేసింది. 10 జులై 2025న అధికారిక వెబ్‌సైట్ polycet.ap.gov.inలో పెట్టింది. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ రంగాలలో డిప్లొమా ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి అవకాశం కల్పిస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సీట్లు కేటాయించారు.
వివరాలు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ polycet.ap.gov.inలలోకి వెళ్లాలి.
- హోమ్‌పేజీలో "కళాశాల వారీగా కేటాయింపు వివరాలు" అనే పేజ్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
- వెంటనే మీకు ఒక కొత్త పేజ్ చూపిస్తుంది.
- అందులో మీ కళాశాల బ్రాంచ్‌ను ఎంచుకుని, "కేటాయింపులు చూపించు" అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- సీట్ల కేటాయింపు ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- అలా వచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
- అలా డౌన్ లోడ్ చేసుకున్న పేజ్‌లో మీ పేరు ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి.
కేటాయింపు ఫలితంపై వివరాలు
ఇప్పుడు విడుదల చేసిన AP POLYCET సీట్ల కేటాయింపు రిజల్ట్స్‌లో ఈ కింది వివరాలు ఉంటాయి.
- అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్
- అభ్యర్థి సాధించిన ర్యాంకు
- అభ్యర్థి పేరు
- అభ్యర్థి జెండర్ ఏంటో ఉంటుంది
- అభ్యర్థి కులం
- అభ్యర్థి ప్రాంతం
- సీటు కేటగిరి
- రౌండ్
ఇలా అన్ని వివరాలు ఉంటాయి.
ఇప్పుడు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కేటాయించిన కాలేజీల్లో జులై 10, 14 తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో వెళ్లి అడ్మిట్ అవ్వాలి. లేకుంటే సీటు క్యాన్సిల్ అవుతుంది. ఇంకా నచ్చిన చోట నచ్చిన కోర్సులో సీటు రాని వారంతా మరోసారి జరిగే సీటు కేటాయింపుల్లో పాల్గొనవచ్చు.





















