అన్వేషించండి

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి - డైరెక్ట్ లింక్ ఇదే

AP Intermediate Results: ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు.

AP Intermediate Results 2024:  ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి, పరీక్షల కన్వీనర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే  రికార్డుస్ధాయిలో ఇంటర్‌ బోర్డు ఫలితాలు ప్రకటించడం విశేషం. 

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్ ఫలితాల డైరెక్ట్ లింక్

ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల డైరెక్ట్ లింక్

ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, 81 శాతంతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. ఫలితాలతో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను, ఫీజువివరాలను అధికారులు వెల్లడించారు. 

ఫలితాల్లో బాలికలదే హవా...
ఇంటర్ ఫలితాల్లో భాలికల హవా కొనసాగింది. జనరల్ విభాగంలో మొదటి సంవత్సరం 71 శాతం బాలికలు అర్హత సాధించగా.. బాలురు 64 శాతం మాత్రమే అర్హత సాధించారు. ఇక ఒకేషనల్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో 47 శాతం బాలురు ఉత్తీర్ణులైతే, 70 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్‌లో సంవత్సరంలో 59 శాతం బాలురు ఉత్తీర్ణులైతే, 80 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్ ఫలితాల డైరెక్ట్ లింక్

ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల డైరెక్ట్ లింక్

ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ఫలితాలకు ఇక్కడ క్లిక్‌చేయండి

ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ఫలితాలకు ఇక్కడ క్లిక్‌చేయండి

ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ఫలితాలకు ఇక్కడ క్లిక్‌చేయండి

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మార్చి 2 నుంచి 20 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.  ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి మొత్తం 10,02,150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,99,756 మంది హాజరుకాగా.. అందులో జనరల్ విద్యార్థులు 4,61,273 మంది; ఒకేషనల్ విద్యార్థులు 38,483 మంది ఉన్నారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మొత్తం 5,02,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. అందులో జనరల్ విద్యార్థులు 3,93,757  మంది; ఒకేషనల్ విద్యార్థులు 32,339 మంది; ప్రైవేటు విద్యార్థులు 76,298 మంది ఉన్నారు. 

ఇంటర్ ఫలితాలకు సంబంధించి జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

జనరల్ విద్యార్థులకు సంబంధించి..

➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలకు సంబంధించి జనరల్ విభాగానికి చెందిన బాలురు 2,26,240 పరీక్షలకు హాజరుకాగా.. 1,43,688 (64%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 2,35,033 మంది పరీక్షలకు హాజరుకాగా.. 1,67,187 మంది ఉత్తీర్ణత సాధించారు.

➥ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి జనరల్ విభాగానికి చెందిన బాలురు 1,88,849 పరీక్షలకు హాజరుకాగా.. 1,41,465 (75%) మంది  ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 2,04,908 మంది పరీక్షలకు హాజరుకాగా.. 1,65,063 మంది (81%) ఉత్తీర్ణత సాధించారు.

ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి..

➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలకు సంబంధించి ఒకేషనల్ విభాగానికి చెందిన బాలురు 16,502 మంది పరీక్షలకు హాజరుకాగా.. 7,814 (47%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 21,981 మంది పరీక్షలకు హాజరుకాగా.. 15,367 మంది ఉత్తీర్ణత సాధించారు.

➥ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి ఒకేషనల్ విభాగానికి చెందిన బాలురు 13,764 మంది పరీక్షలకు హాజరుకాగా.. 8,160 (59%) మంది  ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 18,575 మంది పరీక్షలకు హాజరుకాగా.. 14,840 మంది (80%) ఉత్తీర్ణత సాధించారు.

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి - డైరెక్ట్ లింక్ ఇదే

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి - డైరెక్ట్ లింక్ ఇదే

టాప్ హెడ్ లైన్స్

RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget