(Source: ECI/ABP News/ABP Majha)
'అమ్మఒడి' డబ్బులు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడు జమచేస్తారంటే?
ఏపీలో 'జగనన్న అమ్మఒడి' పథకం నిధులను జూన్ 28న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో 'జగనన్న అమ్మఒడి' పథకం నిధులను జూన్ 28న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23వ సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. కుటుంబ ఆదాయం పట్టణాల్లో నెలకు రూ.12,000; గ్రామాల్లో రూ.10,000 లోపు ఉండాలి. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15,000 నుంచి పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2,000 మినహాయించి, మిగతా రూ.13వేలు మాత్రమే తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.
ప్రభుత్వం నిర్దేశించిన మరిన్ని మార్గదర్శకాలు ఇలా..
➥ విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి.
➥ దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులు పథకానికి అర్హులు.
➥ ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో మినహా ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారు అనర్హులు.
➥ పురపాలిక పరిధిలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉన్నా పథకం వర్తించదు.
➥ ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
➥ వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాల్లోపు, మాగాణి భూమి 3 ఎకరాల్లోపు, రెండూ కలిపి ఉంటే 10 ఎకరాల్లోపు ఉండాలి.
➥ విద్యుత్తు వినియోగం నెలకు 300లోపు యూనిట్లు ఉండాలనే నిబంధన విధించింది.
➥ నాలుగు చక్రాల వాహన యజమానులకు సంబంధించి డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు కూడా మినహాయింపునిచ్చింది. వీరు అమ్మఒడి పథకానికి అర్హులే.
➥ పట్టణాల్లో స్థిరాస్తికి సంబంధించి ఇంటి విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు మించకుండా ఉంటే అమ్మఒడిని వర్తింపజేస్తారు.
➥ పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వంటి కోర్సుల్లో చేరేవారికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తారు.
Also Read:
తెలంగాణలో మరో 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు: మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించడానికి ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాదికి అన్ని జిల్లాల్లో ఒక్కో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని గుర్తుచేశారు.జూన్ 16న సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు జిల్లా స్థాయిలోనే స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ప్రతి జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను స్థాపిస్తున్నామన్నారు. ఇప్పటికే 33 జిల్లాలకు 25 జిల్లాల్లో ఏర్పాటు చేశామని, మిగిలిన ఎనిమిది జిల్లాల్లోనూ ప్రారంభించేందుకు అవసరమైన భూకేటాయింపులు, ఇతర పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్ఐఈఎల్ఐటీలో డిప్లొమా, బీసీఏ, ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
అగర్తలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఈఎల్ఐటీ) 2023 విద్యా సంవత్సరానికి డిప్లొమా, బీసీఏ, ఎంఎస్సీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరకఖాస్తులు కోరుతుంది. కోర్సులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్‌లో ఏదైనా రెండు సబ్జెక్టులతో హెచ్‌ఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..