NIELIT: ఎన్ఐఈఎల్ఐటీలో డిప్లొమా, బీసీఏ, ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
గర్తలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఈఎల్ఐటీ) 2023 విద్యా సంవత్సరానికి డిప్లొమా, బీసీఏ, ఎంఎస్సీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరకఖాస్తులు కోరుతుంది.
అగర్తలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఈఎల్ఐటీ) 2023 విద్యా సంవత్సరానికి డిప్లొమా, బీసీఏ, ఎంఎస్సీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరకఖాస్తులు కోరుతుంది. కోర్సులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
కోర్సు వివరాలు..
✦ డిప్లొమా ఇంజినీరింగ్
విభాగం: కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్.
సీట్ల సంఖ్య: 120
వ్యవధి: మూడు సంవత్సరాలు.
అర్హత: పదో తరగతి లేదా తత్సమానంలో ఉత్తీర్ణత ఉండాలి.
✦ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (బీసీఏ)
సీట్ల సంఖ్య: 40
వ్యవధి: మూడు సంవత్సరాలు.
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్‌లో ఏదైనా రెండు సబ్జెక్టులతో హెచ్‌ఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
✦ ఎంఎస్సీ (ఐటీ)
సీట్ల సంఖ్య: 30
వ్యవధి: రెండు సంవత్సరాలు.
అర్హత: బీఎస్సీ(ఐటీ)/ బీఎస్సీ (సీఎస్)/ బీసీఏ/ బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.06.2023.
➥ మెరిట్ జాబితా వెల్లడి: 28.06.2023.
Also Read:
విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఇక నచ్చిన కాలేజీకి మారొచ్చు - ట్రాన్స్‌ఫర్లకు జేఎన్‌టీయూ అనుమతి!
జేఎన్‌టీయూ పరిధిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు.. ఒక కాలేజీ నుంచి మరొక కాలేజీకి మారేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కళాశాలల మార్పునకు అనుమతిస్తూ జేఎన్‌టీయూ హైదరాబాద్ జూన్ 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి, ఒక యూనివర్సిటీ నుంచి మరో యూనివర్సిటికి, అటానమస్ కాలేజీ నుంచి నాన్ అటానమస్ కాలేజీకి, ఇలా రకరకాల పద్ధతిలో విద్యార్థులకు ట్రాన్స్‌పర్ చేసుకునే అనుమతి కోరుతూ విద్యార్థులు దరఖాస్తు కోరుతారు. స్టూడెంట్ ట్రాన్స్‌ఫర్లు అనేక కారణాలతో ముడిపడి ఉంటాయి. అందులో ప్రధానంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం స్టూడెంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యే వెసులుబాటు కల్పించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..