JNTU: విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఇక నచ్చిన కాలేజీకి మారొచ్చు - ట్రాన్స్‌ఫర్లకు జేఎన్‌టీయూ అనుమతి!
జేఎన్‌టీయూ పరిధిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు.. ఒక కాలేజీ నుంచి మరొక కాలేజీకి మారేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కళాశాలల మార్పునకు అనుమతిస్తూ జూన్ 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
జేఎన్‌టీయూ పరిధిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు.. ఒక కాలేజీ నుంచి మరొక కాలేజీకి మారేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కళాశాలల మార్పునకు అనుమతిస్తూ జేఎన్‌టీయూ హైదరాబాద్ జూన్ 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి, ఒక యూనివర్సిటీ నుంచి మరో యూనివర్సిటికి, అటానమస్ కాలేజీ నుంచి నాన్ అటానమస్ కాలేజీకి, ఇలా రకరకాల పద్ధతిలో విద్యార్థులకు ట్రాన్స్‌పర్ చేసుకునే అనుమతి కోరుతూ విద్యార్థులు దరఖాస్తు కోరుతారు. స్టూడెంట్ ట్రాన్స్‌ఫర్లు అనేక కారణాలతో ముడిపడి ఉంటాయి. అందులో ప్రధానంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం స్టూడెంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యే వెసులుబాటు కల్పించింది.
ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈ ఏడాదిలో స్టూడెంట్ ట్రాన్స్‌ఫర్ల కోసం అనుమతులు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు అన్ని అఫిలియేషన్, అటానమస్ కాలేజీలతో పాటు యూనివర్సిటీ కాలేజీలకు కూడా వర్తించనున్నాయి. ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని యూనివర్సిటీ అకడమిక్ అండ్ ప్లానింగ్ అధికారిని ఆదేశించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే స్టూడెంట్ ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఫస్టియర్ నుంచి ఫస్టియర్‌కు రూ.10 వేలు, సెకండియర్ నుంచి సెకండియర్‌కు రూ.15 వేలు, థర్డ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కు రూ. 20 వేలు, ఫోర్త్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్‌కు రూ.25 వేల చొప్పున స్టూడెంట్ ట్రాన్స్‌ఫర్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, ఈ మేరకు కాలేజీ యాజమన్యాలు తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలు గతేడాది మార్చిలో ప్రభుత్వం జీవో జారీ చేసిన దాని ప్రకారం అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు జేఎన్టీయూ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విభాగంలో పొందుపరిచినట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
Also Read:
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 18న నోటిఫికేషన్, ఇతర తేదీలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్‌లైన్ విధానంలో ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు ప్రవేశాల కోసం జూన్ 19 నుండి 24 వరకు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక జూన్ 21 నుండి 23 వరకు స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. తదనంతరం జూన్ 26 నుండి 30 వరకు వెబ్ అప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జులై 3న సీట్లను కేటాయిస్తారు. డిగ్రీ కళాశాలల్లో జులై 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..