AISSEE 2024 Counselling: సైనిక్ స్కూల్ ప్రవేశాలు, రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ యూజర్ పేరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి సీటు కేటాయింపు ఫలితాలు చూసుకోవచ్చు.
Sainik School Counselling 2024: భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన సీట్ల కేటాయింపు ఫలితాలు ఏప్రిల్ 10న విడుదలయ్యాయి. సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ యూజర్ పేరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి సీటు కేటాయింపు ఫలితాలు చూసుకోవచ్చు. సీటు పొందిన విద్యార్థులు ఏప్రిల్ 12లోగా సంబంధిత పాఠశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలు పత్రాలు పొందిన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఏప్రిల్ 15న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. విద్యార్థులు ఏప్రిల్ 27లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు ఫలితాల కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 28న ప్రవేశ పరీక్ష నిర్వహించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ఫలితాలను మార్చి 13న ఎన్టీఏ విడుదల చేసింది. పరీక్షలో అర్హత సాధించిన వారికి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించింది. తాజాగా సీట్లను కేటాయించింది. ప్రవేశపరీక్షలో అర్హత మార్కులను ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులుగా నిర్ణయించారు. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
సీట్ల సంఖ్య: 5,822.
సీట్ల కేటాయింపు ఇలా..
మొత్తం సీట్లలో 6వ తరగతికి 2970 సీట్లు, 9వ తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఇక కొత్తగా మంజూరైన సైనిక స్కూళ్లలో 2155 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67 శాతం, ఇతర రాష్ట్రాల వారికి 33 శాతం సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50 శాతం సీట్లలో 25 శాతం ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25 శాతం ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీల్లేదు.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
పరీక్షలపై 'ఫేక్ వార్తలు' నమ్మొద్దు, పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) క్లారిటీ ఇచ్చింది. పరీక్షలకు సంబంధించి వస్తున్న 'ఫేక్ వార్తలు' నమ్మవద్దని స్పష్టంచేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఓటు వేసే అభ్యర్థులకు నీట్ పరీక్ష జరిగే హాలులోకి విద్యార్థులను అనుమతించరని వస్తున్న వార్తలను ఎన్టీఏ ఖండించింది. ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తి వేలిపై ఉన్న 'సిరా' వల్ల పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..