Fake News: పరీక్షలపై 'ఫేక్ వార్తలు' నమ్మొద్దు, పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) క్లారిటీ ఇచ్చింది.
NTA Exams: దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) క్లారిటీ ఇచ్చింది. పరీక్షలకు సంబంధించి వస్తున్న 'ఫేక్ వార్తలు' నమ్మవద్దని స్పష్టంచేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఓటు వేసే అభ్యర్థులకు నీట్ పరీక్ష జరిగే హాలులోకి విద్యార్థులను అనుమతించరని వస్తున్న వార్తలను ఎన్టీఏ ఖండించింది. ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తి వేలిపై ఉన్న 'సిరా' వల్ల పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఇటువంటి సందేశాలు నమ్మవద్దని, వీటిలో ఎలాంటి నిజం లేదని, ఓటు వేసిన వారికి పరీక్షలపై ఏలాంటి ప్రభావం చూపదని పేర్కొంది. అభ్యర్థులు చదువుపై దృష్టి పెట్టి రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది.
ఎన్టీఏ నిర్వహించే పరీక్షలకు సంబంధించి మే నెలలో నీట్ యూజీ, సీయూఈటీ యూజీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. నీట్ యూజీకి సంబంధించి విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఫోన్ నెంబరు 011-40759000 లేదా ఈమెయిల్: http://neet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని ఎన్టీఏ తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 5న నీట్ యూజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 5న నీట్ యూజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.
ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు, 7 విడతల్లో పోలింగ్..
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. పోలింగ్ వివరాలు వెల్లడించింది. సీఈసీ రాజీవ్ కుమార్ పూర్తి షెడ్యూల్‌ని వెల్లడించారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల తేదీలు ప్రకటించారు. 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది.
ఏప్రిల్ 19న తొలి విడత లోక్‌సభ పోలింగ్ మొదలవుతుంది. ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. మే7వ తేదీన మూడో దశ, మే 13 న నాలుగో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణలో లోక్‌సభకు, ఏపీలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.