అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AISSEE-2024: 'సైనిక' పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష, ఎంపిక వివరాలు ఇలా!

దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2024)' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

India Sainik Schools Entrance Examination-2024: దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2024)' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 కొత్త సైనిక పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024 ద్వారా జరుగుతాయి.

వివరాలు...

☀ అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE -2024)

సీట్ల సంఖ్య: 5,822.

సీట్ల కేటాయింపు:

మొత్తం సీట్లలో 6వ తరగతికి 2970 సీట్లు, 9వ తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఇక కొత్తగా మంజూరైన సైనిక స్కూళ్లలో 2155 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67 శాతం, ఇతర రాష్ట్రాల వారికి 33 శాతం సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50 శాతం సీట్లలో 25 శాతం ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25 శాతం ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీల్లేదు. 

అర్హతలు..

➥ 6వ తరగతిలో ప్రవేశాలు కోరువారు మార్చి 31.03.2024 నాటికి 10-12 సంవత్సరాల మధ్య ఉండాలి. బాలికలు కూడా 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

➥  9వ తరగతిలో ప్రవేశాలు కోరువారు 31.03.2024 నాటికి 13-15 సంవత్సరాల మధ్య ఉండాలి. 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

పరీక్ష ఫీజు: ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి. జనవరి 08, 2023న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

పరీక్ష విధానం..

➥ పెన్ పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించే మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఆబ్జె్క్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 

➥ 6వ తరగతి ప్రవేశాలు కోరే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు- ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు; ఇక ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 2.30 గంటలు (150 నిమిషాలు).

➥ 9వ తరగతిలో ప్రవేశాలు కోరే విద్యార్థులకు 400 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు-ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు; ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నలు-ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు (180 నిమిషాలు).

➥ 9వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో; 6వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. 

అర్హత మార్కులుపరీక్షలో ఒక్కో సెక్షన్‌కు కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. మొత్తంగా 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని  సైనిక స్కూళ్లతోపాటు 186 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కరీంనగర్, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, .

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.11.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.12.2023 (5.00 PM)

➥ దరఖాస్తుల్లో తప్పుల సవరణ: 18.12.2023 - 20.12.2023,

➥ అడ్మిట్ ‌కార్డు డౌన్‌లోడ్ తేదీ: ఎన్టీఏ వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటిస్తారు.

➥ పరీక్ష తేది: 21.01.2024.

➥ ఆన్సర్ కీ, ఫలితాల వెల్లడి: ఎన్టీఏ వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటిస్తారు.

పరీక్ష సమయం: ఆరోతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

Admission Notification

Information Bulletin

Onine Application

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget