News
News
X

KNRUHS Admissions: బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కన్వీనర్ కోటా మొదటి విడత ప్రవేశ ప్రకటన విడుదల!

అభ్యర్థులు జనవరి 24న ఉదయం 8 గంటల నుంచి జనవరి 26న సాయంత్రం 4 గంటల వరకు  తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు  కళాశాలల వారీగా ‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని వైద్యకళాశాలల్లో బీఎస్సీ అలాయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశాలకు సంబంధించి జనవరి 24 నుండి 26 వరకు మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో యూనివర్సిటీ పరిధిలోని మొదటి విడత కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జనవరి 24న ఉదయం 8 గంటల నుంచి జనవరి 26న సాయంత్రం 4 గంటల వరకు  తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు  కళాశాలల వారీగా ‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా అదేవిదంగా కళాశాల వారిగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

SEAT MATRIX

FINAL MERIT LIST OF ELIGIBLE CANDIDATES

కౌన్సెలింగ్ వెబ్‌‌సైట్

Also Read:

విద్యార్థులకు గుడ్ న్యూస్, డ్యూయల్ డిగ్రీ విధివిధానాలు జారీ!
ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు జేఎన్‌టీయూ(JNTU) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విధివిధానాలను యూనివర్సిటీ జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. దీనిప్రకారం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించింది. అయితే కనీసం 30 శాతం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ఉంటేనే కళాశాలకు అనుమతి లభిస్తుంది. ఇంజినీరింగ్ 2,3,4 ఏడాది చదువుతున్న విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు. వీరందరూ బీటెక్‌తోపాటే బీబీఏ(డేటా అనలిటిక్స్‌) కోర్సు కూడా చదువుకోవచ్చు. వారంలో రెండురోజులు అంటే శని, ఆదివారాల్లో ప్రత్యక్ష బోధన, మిగతా రోజుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు.

మూడేళ్లకు రూ.1.80 లక్షల ఫీజు..
బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఏడాదికి రూ.60 వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మూడేళ్లకుగాను రూ.1.80 లక్షల ఫీజు చెల్లించాలి. అయితే ప్రత్యేక ఫీజు కింద ఏటా రూ.5,500, పరీక్ష ఫీజు రూ.1,910(సెమిస్టర్‌కు రూ.955) చెల్లించాల్సి ఉంటుంది. 

ఆరేళ్లలో పూర్తి చేయకుంటే ప్రవేశం రద్దు..
కనీసం మూడేళ్లు.. గరిష్ఠంగా ఆరేళ్లలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈలోగా పూర్తి చేయకపోతే ప్రవేశం రద్దవుతుంది. కోర్సు చేస్తే 138 క్రెడిట్స్ సాధించేందుకు వీలుంటుంది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. కోర్సు విధివిధానాలు ఖరారు చేసి కళాశాలలకు పంపించామని, వచ్చే నెలలో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. సమయం వృథా కాకుండా బీటెక్‌ పూర్తయ్యేలోపే రెండు డిగ్రీలు చేతికి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీబీఏలో మరిన్ని కోర్సులు తీసుకురావాలనే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

24 నుంచి జేఈఈ మెయిన్ 2023 పరీక్షలు, విద్యార్థులకు ముఖ్య సూచనలివే!
దేశవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుంచి మొదటి విడత జేఈఈ మెయిన్ ప్రారంభం కానుంది. దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 290 నగరాలు/పట్టణాలతో పాటు ఇతర దేశాల్లోని 18 నగరాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 29, 30, 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 1న బీటెక్‌లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. 
విద్యార్థులకు ముఖ్యసూచనల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 23 Jan 2023 09:00 PM (IST) Tags: Education News in Telugu Kaloji Narayana Rao University of Health Sciences KNRUHS Admissions B.Sc(Allied Health Sciences ) Courses B.Sc Allied Health Sciences Courses KNRUHS Conselling

సంబంధిత కథనాలు

KNRUHS: యూజీ ఆయూష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు!

KNRUHS: యూజీ ఆయూష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల

టాప్ స్టోరీస్

CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్‌ టూర్ పూర్తి షెడ్యూల్‌ ఇదీ

CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్‌ టూర్ పూర్తి షెడ్యూల్‌ ఇదీ

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి

Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...