9 రోజుల దుర్గా పూజ

శైలపుత్రి

శైలపుత్రి

హిమవంతుడి కుమార్తె అయిన శైలపుత్రి పూజతో శరన్నవరాత్రి ప్రారంభమవుతుంది. త్రిశూలం, కమలం ధరించి వృషభ వాహనంపై దర్శనమిచ్చే ఈ అమ్మవారిని పార్వతి, హైమావతి అని కూడా పిలుస్తారు. శైలపుత్రిని ప్రార్థించడం వల్ల శ్రేయస్సు, శాంతి, స్థిరత్వం లభిస్తుందని, వివాహ సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుందని నమ్ముతారు. మంత్రం: ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఓం శైలపుత్రి దేవ్యై నమః

కథలు

బ్రహ్మచారిణి

బ్రహ్మచారిణి

జ్ఞానం, తపస్సు, నిగ్రహం స్వరూపమైన బ్రహ్మచారిణి రూపాన్ని రెండో రోజు కొలుస్తారు. ఓ చేతిలో జపమాల మరో చేతిలో కమండలం ధరించి శంకరుడిని భర్తగా పొందేందుకు ఘోరతపస్సు చేసిన రూపం ఇది. తెల్లని దుస్తులు ధరించి, ఆమె ఒక చేతిలో జపమాల మరొక చేతిలో నీటి కుండను పట్టుకుని దర్శనమిస్తుంది. భక్తులు సహనం, అంతర్గత బలం, క్రమశిక్షణ కోసం ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు.బ్రహ్మచారిణి దుర్గ అనుగ్రహం సిద్ధిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మంత్రం: ఓం హ్రీం బ్రహ్మచారిణ్యై నమః

కథలు

చంద్రఘంట

చంద్రఘంట

మూడవ రోజు చంద్రఘంటను పూజిస్తారు. సింహంపై కూర్చుని పదిచేతుల్లో ఖడ్గం, బాణం సరా పది రకాల అస్త్రాలు ధరించి దర్శనమిస్తుంది. తలపై అర్థచంద్రాకారం ఉండడంతో ఈమెను చంద్రఘంటా అని పిలుస్తారు. ఆమె ఆశీర్వాదాలు ధైర్యం, నిర్భయత, ప్రశాంతతను తెస్తాయి. చంద్రఘంట దుర్గను దర్శించుకునే మనసులో అలజడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. మంత్రం: ఐం శ్రీం శక్తియై నమః

కథలు

కూష్మాండ

కూష్మాండ

నాల్గవ రోజు విశ్వ సృష్టికర్తగా పరిగణించే కూష్మాండకు అంకితం చేసిన రోజు. సింహంపై స్వారీ చేస్తూ ఆమె ఎనిమిది చేతులతో జపమాల, కమండలం, విల్లు, బాణం, కమలం, అమృత కలశం , గదను ధరించి దర్శనమిస్తుంది. ఆమెను పూజించడం వల్ల దుఃఖం.. అనారోగ్యాలు తొలగిపోతాయని, తెలివితేటలు పెరుగుతాయని చెబుతారు. మంత్రం: ఓం ఐం హ్రీం క్లీం కూష్మాండాయై నమః

కథలు

స్కందమాత

స్కందమాత

ఐదవ రోజు సింహంపై స్వారీ చేస్తూ కార్తికేయుడిని తన ఒడిలో మోసుకున్న మా స్కందమాతగా పూజలందుకుంటుంది దుర్గాదేవి. సౌర వ్యవస్థ దేవతగా పూజించే ఆమె దైవిక తేజస్సు మరింత ప్రసరిస్తుంది. ఆమె ఆరాధన భక్తులకు జ్ఞానం, సంతాన సంబంధిత ఆనందాన్ని అనుగ్రహిస్తుందని నమ్ముతారు. మంత్రం: ఓం ఐం హ్రీం క్లీం స్కందమాతాయై నమః

కథలు

కాత్యాయనీ

కాత్యాయనీ

ఆరవ రోజున మా కాత్యాయనీని పూజిస్తారు. నాలుగు చేతుల్లో అభయ ముద్ర, వరముద్ర, ఖడ్గం, పద్మం పట్టుకుని సింహంపై స్వారీ చేస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. బంగారు రంగులో ప్రకాశించే కాత్యాయనీ మాత వివాహ అడ్డంకుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. శత్రువుల నుంచి రక్షిస్తుంది. మంత్రం: ఓం దేవి కాత్యాయన్యై నమః

కథలు

కాళరాత్రి

కాళరాత్రి

ఏడవ రోజు... మహా సప్తమి నాడు అత్యంత భయంకరమైన రూపం అయిన కాళరాత్రిని పూజిస్తారు. గాడిదపై స్వారీ చేస్తూ, మెరుపులాంటి దండలతో అలంకరించిన ఆమె... కత్తి , ఇనుప ఆయుధాన్ని కలిగి ఉంటుంది. భయం, దుష్ట శక్తులు, శత్రువుల నుండి ఆమె విముక్తిని ప్రసాదిస్తుందని భక్తులు నమ్మకం మంత్రం: ఓం దేవి కాళరాత్ర్యై నమః

కథలు

మహాగౌరి

మహాగౌరి

మహా అష్టమి నాడు భక్తులు మహా గౌరిని పూజిస్తారు. ఎద్దుపై స్వారీ చేస్తూ తెల్లటి దుస్తులు ధరించిన ఆమె ప్రకాశవంతమైన రంగు స్వచ్ఛతను సూచిస్తుంది. నాలుగు చేతుల్లో అభయముద్ర, త్రిశూలం, ఢమరుకం, వరముద్రతో ఆశీర్వదిస్తుంది. మహాగౌరిని ప్రార్థిస్తే ఆనందం, శ్రేయస్సు మనశ్శాంతిని ఇస్తుందని నమ్ముతారు. మంత్రం: శ్రీ క్లీం హ్రీం వరదాయై నమః

కథలు

సిద్ధిదాత్రి

సిద్ధిదాత్రి

మహా నవమి నాడు సిద్ధిదాత్రి ఆరాధనతో నవరాత్రి ఉత్సవం ముగుస్తుంది. నాలుగు చేతులతో చక్రం, గద, శంఖం, కమలం పట్టుకుని కమలం మీద ఆశీనులై ఉంటుంది. ఆమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది, ఆమె ఆరాధన కోరికలను నెరవేరుస్తుందని చెబుతారు. ఈ రోజున కన్యా పూజ , హవనం వంటి ఆచారాలు కూడా నిర్వహిస్తారు. మంత్రం: ఓం సిద్ధిదాత్ర్యై నమః

కథలు

చూడండి

Advertisement
Sponsored Links by Taboola

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
Embed widget