అన్వేషించండి

Navaratri Day 7: నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజు శ్రీ మహా చండీ దేవి అలంకారం - పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!

Shardiya Navratri 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 28 ఏడో రోజు శ్రీ చండీదేవి అలంకారంలో దర్శనమిస్తోంది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ...ఈ అలంకారం విశిష్టత ఇదే..

Maha Chandi  Devi Alankaram: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  రోజుకో అలంకారంలో అనుగ్రహించే దుర్గమ్మ...బాలా త్రిపురసుందరి, గాయత్రి , అన్నపూర్ణ,  కాత్యాయనీ, మహాలక్ష్మి , లలితా దేవిగా దర్శనమిచ్చింది. ఉత్సవాల్లో ఏడో రోజైన సెప్టెంబర్ 28 ఆదివారం మహా చండీదేవి అలంకారంలో దర్శనమిస్తోంది. 

చండీదేవిని రెండు విధాలుగా పిలుస్తారు..పూజిస్తారు..
 
1. చండీదేవి ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమావతి, శతాక్షి, జగన్మాత, భవాని అని కొలుస్తారు

2. చండీదేవి భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గ, కాళి , శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పూజిస్తారు
 
శరన్నవరాత్రుల సందర్భంగా చండీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుంటే మనసులో ఉండే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
 
చండీదేవి ఆవిర్భావం

ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా దేవతలను చిత్రహింసలకు గురిచేశారు అసురులు. దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా శంకరుడి వద్దకు వెళ్లి రాక్షసుల బారినుంచి రక్షించమని వేడుకున్నారు. ఆ సమయంలో శివుడు మాతృదేవతలను స్తుతించమని సూచించాడు. అప్పుడు దేవతలంతా కలసి మాతృదేవతలను స్తుతించగా లక్ష్మీ, సరస్వతి, గౌరి ఈ ముగ్గురి శక్తీ కలపి ఓ రూపం ఆవిర్భవించింది. ఆ రూపమే చండీదేవిగా రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణగా నిలిచింది. 

నీల్ పర్వత శిఖరంపై కొలువైన చండీదేవి

రాక్షస సంహారం తర్వాత చండీదేవి హరిద్వార్ లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువైందంటారు. ఇక్కడ ఆలయంలో కొలువుతీరిన విగ్రహాన్ని ఆదిశంకరాచార్యులు  ప్రతిష్టించారని చెబుతారు. నిత్యం భక్తులతో కళకళలాడే చండీదేవి ఆలయం శరన్నవరాత్రుల్లో మరింత కిక్కిరిసిపోతుంది. హిమాలయ పర్వతశ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని సుచత్ సింగ్ అనే కాశ్మీర్ రాజు నిర్మించాడని స్థలపురాణం. ఈ ప్రదేశానికి పర్యటనకోసం వచ్చిన జగద్గురు శంకరాచార్యులవారు శక్తిస్వరూపిణిని ప్రతిష్టించారని స్థలపురాణం.   దసరా నవరాత్రుల్లో ఇక్కడ చండీహోమం ఘనంగా నిర్వహిస్తారు.  ఈ దేవాలయం భారతదేశంలో ప్రాచీన ఆలయాల్లో ఒకటి.  చండీ చౌడాస్, నవరాత్రి ఉత్సవం, కుంభమేళా సమయంలో భారీగా భక్తులు సందర్శిస్తారు. హరిద్వార్ సందర్శించే యాత్రికులు తప్పనిసరిగా దర్శించవలసిన ఆలయం ఇది. ఈ ఆలయానికి సమీపంలోనే హనుమంతుడి తల్లి అయిన అంజనా దేవి దేవాలయం ఉంది. నీల పర్వతం క్రింద "నీలేశ్వర్ దేవాలయం" ఉంది. పార్వతీ దేవి రూపాలైన "మానస", "చండీ" ఎప్పుడూ కలసి ఉండేవారని విశ్వాసం. అందుకే మానస దేవాలయం కూడా నీల పర్వతానికి ఎదురుగా ఉన్న బిల్వ పర్వతంపై ఉంటుంది.  

చండీదేవి నైవేద్యం

దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ - శిష్టరక్షణ కోసం మూడు శక్తులకలపిన శక్తిగా ఆవిర్భవించిన మహాచండిని దర్శించుకుంటే చేపట్టిన కార్యాల్లో విజయం తథ్యం అంటారు. మహాచండికి ప్రత్యేక పూజలు చేసి..  కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూ, రవ్వకేసరి, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించి, ఎర్రటి పూలతో పూజిస్తారు. ఈ రోజు చండీ ధ్యానం, లలితా సహస్రనామ స్తోత్రం,  ఖడ్గమాల పఠించాలి. 

శ్రీ చండికా ధ్యానం ( Chandika Dhyanam )
 
ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాధివాసినీమ్ |
స్ఫురచ్చంద్రకలారత్నముకుటాం ముండమాలినీమ్ ||

త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్తనీమ్ |
పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్ ||

దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితామ్ |

యా చండీ మధుకైటభాదిదలనీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షణచండముండమథనీ యా రక్తబీజాశనీ |

శక్తిః శుంభనిశుంభదైత్యదలనీ యా సిద్ధిదాత్రీ పరా|
సా దేవీ నవకోటిమూర్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ ||

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget