Dussehra 2025: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు 5 రోజుల్లో భారీ ఆదాయం, ఇకపై భక్తులందరకీ ఉచిత దర్శనం - వీఐపీలు గమనించాలి!
Vijayawada: విజయవాజడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భారీగాతరలివచ్చే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు

Vijayawada Dussehra: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ..నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకారంలో దర్శనమిస్తోంది. అమ్మవారి దర్శనానికి భారీగాభక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని రకాల దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేశామని, భక్తులందరికీ ఉచితంగానే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే... నిర్దేశించిన సమయాల్లో VIP దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు. నిర్దేశిత సమయాలు పాటించని వీఐపీల వల్ల సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగుతోంద్న విషయం ప్రముఖులు గమనించాలన్నారు.
మొదటి ఐదు రోజుల్లో కనకదుర్గమ్మ ఆదాయం రూ.28 లక్షలు
దసరా ఉత్సవాల్లో ఐదవ రోజు అయిన సెప్టెంబర్ 26 శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి పలు రకాల సేవల రూపేణా అమ్మవారికి 28లక్షల 21 వేల 637 రూపాయల ఆదాయం వచ్చింది. 15 రూపాయల లడ్డూలు 19,121 విక్రయించగా 2 లక్షల 86వేల 815 రూపాయలు , వందరూపాయల లడ్డు బాక్స్ లు 23,581 విక్రయించగా 23 లక్షల 58 వేల 100 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఇవి కాకుండా పరోక్షంగా జరిగిన ప్రత్యేక కుంకుమార్చనల ద్వారా 20 వేల రూపాయలు, ప్రత్యేక పరోక్ష చండిహోమం ద్వారా 4 వేలు, శ్రీచక్రార్చన ద్వారా 6వేలు...ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా 35 వేల 812 రూపాయలు ఫోటో& క్యాలెండర్ల విక్రయం ద్వారా 4 వేల 890 రూపాయలు, కేశఖండన ద్వారా 1,01,520 ఇతరత్రా 4,500 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 90 వేల 6 మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. రాత్రి 12 గంటలవరకూ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరగుతుంది. చిన్నారులు తప్పిపోకుండా 6,185 ట్యాగ్ లు పిల్లలకు వేశామని తెలిపారు. 23 వేల 656 మందికి అన్న ప్రసాద విచారణ చేసినట్లు తెలిపారు.
"అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్"
పోతన రాసిన ఈ పద్యం చదివినా, విన్నా మంచి ఫలితం పొందుతారు. సాధారణంగా కొన్ని శ్లోకాలు, పద్యాలను గురువులు పక్కన లేకుండా, పూర్తిగా చదవడం రాకుండా తప్పులు చదవకూడదు. శక్తి స్వరూపిణికి సంబంధించిన పూజల విషయంలో అస్సలు ఈ ప్రయోగం చేయకూడదు. బీజాక్షరాలున్న శ్లోకం అయితే పొరపాటున కూడా తప్పుగా చదవకూడదు. అందుకే ఈ పద్యం ద్వారా సులువుగా అమ్మవారిని స్మరించుకునే అవకాశం కల్పించారు పోతన.
దసరా నవరాత్రులు సందర్భంగా ఆంధ్ర & తెలంగాణలో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ఆలయాలు ఇవే!
శ్రీ చక్రంలో వివిధ దేవతలను స్తుతిస్తూ సాగే శక్తివంతమైన స్తోత్రం - నవరాత్రుల్లో ఒక్కసారైనా పఠించండి!
శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















