అన్వేషించండి

Navaratri Day 6: నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం - పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!

Shardiya Navratri 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 27 ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ...ఈ అలంకారం విశిష్టత ఇదే..

Sri Lalitha Tripura Sundari  Devi: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో అనుగ్రహించే దుర్గమ్మ...బాలా త్రిపురసుందరి, గాయత్రి , అన్నపూర్ణ, శ్రీ కాత్యాయనీ, మహాలక్ష్మి  దేవిగా దర్శనమిచ్చింది. ఉత్సవాల్లో ఆరో రోజైన సెప్టెంబర్ 27  శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా  దర్శనమిస్తోంది.

ప్రాత: స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్

త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవతగా కొలుస్తారు. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమెది. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి లలితాదేవి. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపు శ్రీ మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. లలితా అమ్మవారి దర్శనం  దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి.

ఈరోజు  లలితా త్రిపుర సుందరీ దేవిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. ఎర్రటి పూలతో పూజించాలి. అప్పాలు, పులిహోర, రవ్వ కేసరి మీ శక్తిమేకు నైవేద్యం  సమర్పించాలి.
 
త్రిపుర సుందరి అంటే మూడు లోకాలను పాలించే దేవత అని అర్థం. భండాసుర సంహారం కోసం అవతరించిన లలితా త్రిపుర సుందరి భీకరమైన యుద్ధం చేసింది. త్రిపుర సుందరీదేవి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 

ప్రకృతిశక్తికి ప్రతీక లలితాదేవి. పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకి ఇమిడి ఉన్నాయి..శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే 5 రూపాల్లో ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి. వీటన్నింటిలోనూ మరో శక్తి ఇమిడి ఉంటుంది..ఆ శక్తినే లలితగా భావిస్తారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఓజోన్‌ పొర లోపలి భాగంలో జీవశక్తి వృద్ధి చెందుతుంది. ఈ అంశాన్ని శ్రీ సూక్తం (హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం) ఈ శక్తి హిరణ్య ప్రాకారాంతర్గతం అని చెబుతారు. అంటే హిరణ్య ప్రాకారమే ఓజోన్‌ పొర. ఈ ఓజోన్‌ పొరకు బయట జ్వలంతిగా లోపలివైపు ఆర్ద్రగా కనిపిస్తుంది. భూమిని శివలింగంగా భావిస్తే దానిచుట్టూ ఆవరించి ఉన్న  అమ్మవారు లలిత. దీనికి సింబాలిక్ గానే లలితా త్రిపుర సుందరి ఫొటోస్ లో శివుడిపై కూర్చున్న అమ్మవారిని చూస్తుంటాం.

లిలతా అమ్మవారి ఉపాసన సౌమ్యత్వాన్ని పెంచుతుంది. శ్రీచక్ర స్థితంగా కనిపించే  లలితా త్రిపుర సుందరి  శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయ ఉంది. ఆత్మ, మనస్సు, శరీరం అనేవి 3 పురాలు. ఈ త్రిపురాలలో ఉండే రాక్షసత్వం (త్రిపురాసురులు) తొలగించుకుంటే అమ్మ సౌందర్యాన్ని నింపి త్రిపుర సుందరిగా వెలుగుతుంది. పాంచభౌతికశక్తి సమాహారమైన అమ్మవారిని తత్త్వాన్ని ఉపాసిస్తే  ఈ  పాంచభౌతిక శరీరంలో అన్ని భాగాల్లోను అనంతమైన శక్తి చేకూరుతుంది. 

గమనిక:   ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

MP Sudha Murty Rajya Sabha Speech on Social Media | రాజ్యసభలో సోషల్ మీడియాపై సుధామూర్తి | ABP Desam
Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko | రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IndiGo crisis: ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
IndiGo Crisis: ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
Embed widget