అన్వేషించండి

Devi Khadgamala stotram: శ్రీ చక్రంలో వివిధ దేవతలను స్తుతిస్తూ సాగే శక్తివంతమైన స్తోత్రం - నవరాత్రుల్లో ఒక్కసారైనా పఠించండి!

Shardiya Navratri 2025: దేవీ ఖడ్గమాలా స్తోత్రం  శ్రీవిద్యా సంప్రదాయంలో శక్తివంతమైన స్తోత్రం ఇది. శ్రీ చక్రంలోని వివిధ దేవతలను స్తుతిస్తూ, దేవీ  ఖడ్గం  రూపంలో ఆమె శక్తిని వర్ణిస్తుంది.

Devi Khadgamala stotram : దేవీ ఖడ్గమాలా స్తోత్రం శ్రీ చక్ర నవావరణ దేవతలను ఆరాధించేందుకు ఉపయోగించబడుతుంది. ఇది ఆధ్యాత్మిక, రక్షణ , సిద్ధి ప్రదానం చేసే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు. దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని స్పష్టమైన ఉచ్చారణ , భక్తితో పఠించాలి. దీనిని సాధారణంగా శ్రీ చక్ర పూజ సమయంలో, దేవీ ఉపాసనలో పఠిస్తారు. ఈ స్తోత్రం శ్రీ చక్రంలోని 9 ఆవరణాల (నవావరణ) దేవతలను ఒక్కొక్కటిగా స్తుతిస్తూ వారి శక్తులను వివరిస్తుంది.

ప్రార్థన 
హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రిణేత్రోజ్జ్వలామ్ 
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ 

అస్య శ్రీశుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషిః, దైవీ గాయత్రీ ఛందః, సాత్త్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః |
మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ 

ధ్యానం

తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై 
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి 

ఆరక్తాభాం త్రినేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యాం 
హస్తాంభోజైస్సపాశాంకుశమదన ధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ 
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం 
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ 

లమిత్యాది పంచ పూజాం కుర్యాత్, యథాశక్తి మూలమంత్రం జపేత్ 

లం– పృథివీతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై గంధం పరికల్పయామి – నమః
హం– ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి – నమః
యం– వాయుతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి – నమః
రం– తేజస్తత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం పరికల్పయామి – నమః
వం– అమృతతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి – నమః
సం– సర్వతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి – నమః

(శ్రీదేవీ సంబోధనం)
ఓం ఐంహ్రీంశ్రీంఐంక్లీంసౌః ఓం నమస్త్రిపురసుందరి 

న్యాసాంగదేవతాః
హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి

తిథినిత్యాదేవతాః
కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే,

దివ్యౌఘగురవః
పరమేశ్వరపరమేశ్వరి, మిత్రేశమయి, షష్ఠీశమయి, ఉడ్డీశమయి, చర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి,

సిద్ధౌఘగురవః
కాలతాపనమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, దీపకళానాథమయి,

మానవౌఘగురవః
విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కళ్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీరామానందమయి,

శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహనచక్రస్వామిని, ప్రకటయోగిని,

శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః
కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరిపూరకచక్రస్వామిని, గుప్తయోగిని,

శ్రీచక్ర తృతీయావరణదేవతాః
అనంగకుసుమే అనంగమేఖలే అనంగమదనే అనంగమదనాతురే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకుశే  అనంగమాలిని సర్వసంక్షోభణచక్రస్వామిని గుప్తతరయోగిని

శ్రీచక్ర చతుర్థావరణదేవతాః
సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి, సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని, సంప్రదాయయోగిని,

శ్రీచక్ర పంచమావరణదేవతాః
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి,
సర్వసౌభాగ్యదాయిని, సర్వార్థసాధకచక్రస్వామిని, కులోత్తీర్ణయోగిని,

శ్రీచక్ర షష్ఠావరణదేవతాః
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామిని, నిగర్భయోగిని,

శ్రీచక్ర సప్తమావరణదేవతాః
వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని, సర్వరోగహరచక్రస్వామిని, రహస్యయోగిని,

శ్రీచక్ర అష్టమావరణదేవతాః
బాణిని చాపిని పాశిని  అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రదచక్రస్వామిని అతిరహస్యయోగిని

శ్రీచక్ర నవమావరణదేవతాః
శ్రీశ్రీమహాభట్టారికే సర్వానందమయచక్రస్వామిని పరాపరరహస్యయోగిని

నవచక్రేశ్వరీ నామాని
త్రిపురే త్రిపురేశి త్రిపురసుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీః త్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబ మహాత్రిపురసుందరి

శ్రీదేవీ విశేషణాని, నమస్కారనవాక్షరీ చ
మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కంధే మహామహాశయే మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞి నమస్తే నమస్తే నమస్తే నమః  

ఫలశ్రుతిః |
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః |
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్య విప్లవే ||

లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే |
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ||

అపస్మారజ్వరవ్యాధి-మృత్యుక్షామాదిజే భయే |
శాకినీ పూతనాయక్షరక్షఃకూశ్మాండజే భయే ||

మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే |
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ||

సర్వోపద్రవనిర్ముక్త-స్సాక్షాచ్ఛివమయోభవేత్ |
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ||

ఏకవారం జపధ్యానం సర్వపూజాఫలం లభేత్ |
నవావరణదేవీనాం లలితాయా మహౌజసః ||

ఏకత్రగణనారూపో వేదవేదాంగగోచరః |
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ||

లలితాయా మహేశాన్యా మాలా విద్యామహీయసీ |
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ ||

అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ |
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ ||

మాలామంత్రం పరం గుహ్యం పరం‍ధామ ప్రకీర్తితమ్ |
శక్తిమాలా పంచధా స్యాచ్ఛివమాలా చ తాదృశీ ||

తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ||

ఇతి శ్రీవామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీ దేవీఖడ్గమాలాస్తోత్రరత్నమ్ |

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Embed widget