Shardiya Navratri 2025: శారదీయ నవరాత్రుల్లో కన్యాపూజతో నవగ్రహ దోషాల నుంచి విముక్తి ! పూజా విధానం తెలుసుకోండి!
Kanya Puja 2025: నవరాత్రిలో కన్యా పూజకు ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం కన్యా పూజ ఏ సమయంలో చేయాలో తెలుసుకోండి...

Shardiya Navratri 2025 Kanya Puja: శక్తి స్వరూపిణి భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో మునిగితేలుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి మూడు రోజుల్లో అష్టమి, నవమి, దశమి తిథి రోజుల్లో కన్యాపూజ చేస్తారు. ఇందులో భాగంగా చిన్నారులను అమ్మవారి స్వరూపంగా భావించి షోడసోపచార పూజచేసి.. వస్త్రాలు సమర్పించి..భోజనం పెట్టి..ఆశీర్వచనం తీసుకుంటారు. ప్రతి ఆడపిల్లలోనూ అమ్మవారు ఉంటుందన్నది హిందువుల విశ్వాసం. అందుకే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కన్యాపూజ చేస్తారు.
కన్యా పూజకు నవగ్రహాలకు సంబంధం
నవరాత్రిలో సరైన పద్ధతిలో కన్యా పూజ చేయడం ద్వారా నవగ్రహాల చెడు ప్రభావం నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. కన్యాపూజ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు..జీవితంలో సానుకూల మార్పులు, సుఖం, శ్రేయస్సు, కీర్తి పెరుగుతుందనే నమ్మకం కూడా. కన్యా పూజ సమయంలో తయారుచేసే ప్రసాదం కూడా గ్రహాలకు సంబంధించినది.
| కన్యా పూజ సమయంలో గోధుమ పిండితో తయారు చేసిన ప్రసాదం బుధుడు (Jupiter)కి చిహ్నం. |
| పాలు పొంగించి నివేదించే ప్రసాదం సూర్యునికి (Sun) చిహ్నం. |
| నల్ల శనగలు శనికి (Saturn) చిహ్నం. |
| కన్యాపూజలో భాగంగా బాలికల పాదాలు నీటితో కడిగినప్పుడు అది చంద్రుని (Moon) శాంతింపచేస్తుంది |
| బాలికల చేతికి మౌళిని కట్టినప్పుడు, అది కుజుడికి (Mars) ప్రాతినిధ్యం వహిస్తుంది. |
| అనంతరం బాలికలకు బార్లీ ఇచ్చినప్పుడు, అది రాహువుకు (Rahu) చిహ్నం. |
| బాలికలకు గాజులు ఇచ్చినప్పుడు, అది బుధుడికి (Mercury) ప్రాతినిధ్యం వహిస్తుంది. |
| మీరు బాలికలకు వస్త్రాలు,డబ్బులు అందించినప్పుడు శుక్రుడికి (venus) చిహ్నం. |
| బాలికల పాదాలను తాకినప్పుడు, ఇది కేతువు స్థితిని మెరుగుపరుస్తుంది. |
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కన్యా పూజను సరైన పద్ధతిలో చేయడం ద్వారా నవగ్రహాల అనుగ్రహంతో పాటూ దుర్గమ్మ అనుగ్రహం కూడా పొందుతారు.
కన్యా పూజ ఎప్పుడు చేయాలి?
అష్టమి తిథి
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి తిథి నాడు కన్యా పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి భోజనం పెడతారు. ఈ రోజు ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా కన్యాపూజ చేసుకోవచ్చు
నవమి తిథి
చాలా మంది నవమి తిథి నాడు కూడా కన్యా పూజ చేస్తారు. నవమి తిథి శక్తి సాధనకు చివరి దశగా పరిగణిస్తారు. ఈ రోజున కూడా చాలా చోట్ల చిన్న చిన్న బాలికలను ఇంటికి ఆహ్వానించి పూజ చేసి వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి..ఆశీర్వచనం తీసుకుంటారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా మాత్రమే సేకరించి అందించాం. ఏబీపీ దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించడం లేదు.ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేముందు, అనుసరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
దుర్గాష్టమి నుంచి త్రిరాత్ర వ్రతం, ఈ మూడు రోజులు ఎందుకు ప్రత్యేకం? ఏం చేయాలి? పూర్తివివరాల కోసం ఈ వివరాలు తెలుసుకోండి
శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















