Navratri Day 8 Saraswathi Devi : శరన్నవరాత్రుల్లో మూలానక్షత్రం రోజు సరస్వతీ దేవి అనుగ్రహం కోసం విద్యార్థులు ఈ శ్లోకాలు పఠించండి!
Navratri Day 8 : మూలా నక్షత్రం రోజు నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలు అని భావిస్తారు భక్తులు. మూలా నక్షత్రం రోజు సరస్వతి శ్లోకాలు మీ పిల్లలకు నేర్పించండి

Saraswati Devi Powerful Slokas: శరన్నవరాత్రుల్లో మూలానక్షత్రం రోజు సరస్వతీ దేవి అనుగ్రహం కోసం విద్యార్థులతో ఈ శ్లోకాలు చదివించండి ఈ రోజు
'సర్వ విద్యా స్వరూపా యా సా ప దేవీ సరస్వతీ'
సంగీతం, సాహిత్యం, ప్రతిభ, స్మృతి, మేధస్సు, వ్యాఖ్యానం, బోధనాశక్తి అన్నీ లభించేది సరస్వతీ కటాక్షంతోనే..
సరస్వతీదేవి చేతిలో వీణ సంగీత విద్యలకు సంకేతం
పుస్తకం లౌకిక విద్యలకు సంకేతం
అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతం
ఈ రోజు విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే మంచి జరుగుతుంది.. చాలా ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు
సరస్వతీ దేవిని స్తుతిస్తూ ఈ శ్లోకాలు మీ పిల్లలతో చెప్పించండి
ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనా మవిత్ర్యవతు
శ్లోకం
సరస్వతి నమ: స్తుభ్యం వరదే కామరూపిణి
విద్యరంభం కరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణని
నిత్యం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి
శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ ||
ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా ||
పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ ||
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ||
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ ||
సరస్వతి స్తోత్రం
యా కుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రావృతా
యా వీణావర దండమండితకరా యా శ్వేతపద్మాసనా ||
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||
దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభైరక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాఽసమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ||
సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||
ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ||
మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ||
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యైచ సర్వజ్ఞేతే నమోనమః ||
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ||
అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః ||
అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణిమాద్యష్ట సిద్ధాయై ఆనందాయై నమో నమః ||
జ్ఞానవిజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమోనమః|
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ||
పద్మజా పద్మవంశాచ పద్మరూపే నమోనమః |
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ||
మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ||
కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ||
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ||
ఇత్థం సరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్ |
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ ||






















