గేట్ మూయలేదని పొరుగింటి వ్యక్తితో గొడవ, చెవి కొరికి మింగేసిన మహిళ
Crime News: ఆగ్రాలో ఓ మహిళ పొరుగింటి వ్యక్తితో గొడవ పడి చెవి కొరికి మింగేసింది.
Woman Bietes off Man's Ear: గేట్ మూసే విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళ ఓ వ్యక్తి చెవి కొరికి మింగేసింది. ఆగ్రాలో జరిగిందీ ఘటన. గేట్ వేయడం మర్చిపోయాడన్న కోపంతో వాగ్వాదానికి దిగింది. అది కాస్తా భౌతికంగా దాడి చేసే వరకూ వెళ్లింది. మీద పడిపోయి చెవి గట్టిగా కొరికింది. ఆ తరవాత కొరికిన ముక్కని మింగింది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. న్యూ ఆగ్రాలో తమ ఇంటి పక్కనే ఈ మహిళ ఉంటోందని వివరించాడు. చుట్టుపక్కల వాళ్లతో రోజూ ఇలాగే గొడవ పడుతోందని చెప్పాడు. మార్చి 4వ తేదీన తన కొడుకుని ఎగ్జామ్‌హాల్‌కి తీసుకెళ్లేందుకు ఉదయం 6 గంటలకే బయటకు వచ్చాడు బాధితుడు. ఆ తొందరలో గేట్ వేయడం మర్చిపోయాడు. ఆ సమయంలోనే గట్టిగా కేకలు వేస్తూ గొడవ పెట్టుకుంది ఆ మహిళ. బూతులు తిట్టడం మొదలు పెట్టింది. ఫలితంగా..ఆమెని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు బాధితుడు. ఆ తరవాత మహిళ భర్త వచ్చి బాధితుడిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ గొడవలోనే అతని చెవి కొరికేసింది. పోలీసులు ఈ ఘటనపై FIR నమోదు చేశారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.