Crime News: భార్యాభర్తల వివాదం - భర్తను కత్తెరతో పొడిచి చంపేసిన భార్య, తూ.గో జిల్లాలో దారుణం
Andhra News: భార్యాభర్తల మధ్య వివాదంతో ఓ భార్య.. తన భర్తతో కత్తెరతో పొడిచి చంపేసింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో చోటు చేసుకుంది.
Wife Killed Her Husband In East Godavari District: భార్యాభర్తల మధ్య వివాదంతో.. ఓ భార్య తన భర్తను దారుణంగా హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari District) జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం (Undrajavaram) మండలంలోని రెడ్డిచెరువు గ్రామానికి చెందిన చింతలపూడి శ్రీనివాసరావు, రాణి దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా వీరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన రాణి తన భర్త గుండెలపై కత్తెరతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును అతని సోదరుడు తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని.. పూర్థిస్థాయిలో విచారిస్తున్నామని సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు.
Also Read: Eluru News: బాలికలను కట్టేసి లైంగిక దాడి, ఫోటో షూట్లు! గల్స్ హాస్టల్‌లో వార్డెన్ భర్త ఘోరం