Warangal: కట్టుకున్న భార్యపై భర్త ఘాతుకం.. వివస్త్రను చేసి, గొంతుకు తాడు బిగించి హత్య
ఓ భర్త తాను కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఆమెను విస్త్రను చేసి, గొంతుకు తాడును బిగించి హత్య చేశాడు.
వరంగల్‌లో భార్యపై పెంచుకున్న అనుమానం ఆమె హత్యకు దారి తీసింది. ఓ భర్త తాను కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఆమెను విస్త్రను చేసి, గొంతుకు తాడును బిగించి హత్య చేశాడు. వరంగల్ జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారం ఈ నెల 8న జరిగింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆ కేసును చేధించారు. ఈ నెల 8న అన్నారం గ్రావిటీ కెనాల్‌లో లభ్యమైన గుర్తుతెలియని మహిళా శవం కేసును గుర్తించారు. విచారణ చేసి నిందితులను గుర్తించామని జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.
అడిషనల్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన రేగుల సౌజన్యతో భర్త రేగుల తిరుపతి.. భూపాల పల్లికి వెళ్లడానికి ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మైదబండాకు చెందిన తన బావమరిది ఎర్రం సురేష్ కారు అద్దెకు తీసుకున్నాడు. ఆ కారులో వెళ్తూ మార్గమధ్యలో సౌజన్య స్నేహితురాలైన వెంకటేశ్వరిని కారులో ఎక్కించుకుని వెళ్లారు.
Also Read: Hyderabad Drugs: ఓఆర్ఆర్ వద్ద ఇద్దరు యువకులు, యువతి.. ముగ్గురూ కలిసి కారులో.. అడ్డంగా బుక్
అయితే, తిరుపతికి తన భార్య సౌజన్యపై అనుమానం ఉండడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం తిరుగు ప్రయాణంలో మెడిపల్లి అటవీ ప్రాంతంలో భార్య సౌజన్యను వివస్త్రను చేశాడే. ఆమె మెడకు తాడు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని అన్నారం గ్రావిటీ కాల్వలో పడేసి ఆమె బట్టలు మంథని శివారు ప్రాంతంలోని భట్టుపల్లి వద్ద దహనం చేశారు. అనంతరం పారిపోయినట్లుగా పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నారు.
Also Read: Farmer Suicide: కన్నబిడ్డలా చూసుకున్న పంట ఒడిలోనే.. రైతు రవీందర్ ఆత్మహత్య..
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, గతంలోనే తిరుపతిపై వరకట్నం కేసు, మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు పేరుతో డబ్బులు సంపాదించిన కేసులు ఉన్నాయని ఏఎస్పీ శ్రీనివాసులు వివరించారు. అనుమానితులను గురువారం ఉదయం మహదేవపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామశివారులో వాహన తనిఖీలు చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు
Also Read: YS Sharmila: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు.. త్వరలో పాదయాత్ర చేస్తా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి